వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తణికెళ్ల భరణి 'సామాన్య సూక్తం: బిచ్చగాళ్ళొస్తున్నారు!

By Pratap
|
Google Oneindia TeluguNews

ప్రపంచంలో అన్ని వృత్తుల్లోకి అత్యంత నీచమైన వృత్తిగా నాగరిక సమాజం పరిగణించేది భిక్షాటన... మరి ప్రతి వృత్తిలోనూ ఇవ్వడం, పుచ్చుకోవడం అనే రెండు క్రియలుంటాయి. కానీ, భిక్షాటనలో మాత్రం ఏకాడికీ పుచ్చుకోడమే!... ఎవన్న అంటే ''పుణ్యం వస్తోంది గదా'' అని మన సెంటిమెంట్‌మీద మనమే దెబ్బ కొట్టేసుకుంటాం... గుడ్డివాళ్ళకి గుడ్డిగా ధర్మం చేసే నమ్మకం మనది. తప్పులేదు! పుణ్యం సంగతలా వున్నా వాడి పరిస్థితికి జాలిపడి తృణమో పణమో పారెయ్యడం మానవత్వం గూడానూ... గానీ ఈ ముష్టిలో రకాలున్నాయి... ముష్టి... వీరముష్టి... అంటే ఈ రెండోజాతివాళ్ళు నడిరోడ్డులో కాలర్‌ పుచ్చుకుని పిలిచి మరీ వసూలు చేస్తారు... ''పోతులాగున్నవ్‌ అడక్కోవడేం ఖర్మ'' అంటే చాల్లేవయ్యా ఇస్తే ఇయ్చి లేదా అవతలకి దయచెయ్యి అనే రోజులు...

తణికెళ్ల భరణి 'సామాన్య సూక్తం': రిపేరు చేయబడునుతణికెళ్ల భరణి 'సామాన్య సూక్తం': రిపేరు చేయబడును

తెల్లారగట్టే లేవగానే మనకి సూర్యనారాయణమూర్తి దర్శనం అయినా కాకపోయినా ముష్టివాళ్ళ దర్శనం మాత్రం తప్పదు....
కాళ్ళూ, కళ్ళూ లేవు నారాయణా!...
మాదాకబళం తల్లీ!
నీ పిల్లలు సల్లగుండ! - ఈ విధమైన పడికట్టు పదాలతో మన గూబ వాయించేస్తారు. వీళ్ళ తాకిడికి తట్టుకోలేక గుళ్ళల్లో కెళ్ళడం కూడా మానేస్తున్నారు కొంతమంది. సరే, పాతికమంది వుండీ ఏ యిద్దరికో వేశామనుకోండి! అక్కణ్నించి ముష్టియుద్ధం ప్రారంభం. వాళ్ళు కొట్టుకోవడం సంగతి అలావుంచీ... డబ్బు వేసిన పాపానికి మనల్నీ నోటికొచ్చినన్ని తిడతారు. బస్టాండ్లలోనూ, రైల్వే ప్లాట్‌ఫారాలమీదా ముక్కుపచ్చలారని పిల్లలు ముష్టెత్తుకోవడం చూస్తే గుండె తరుక్కుపోతుంది వాళ్ళ భవిష్యెత్తేమిటా అని... ఇంకో విషయం ఏమంటే అడుక్కోవడం రుచి మరిగినవాడికి కష్టపడాలన్న ధ్యాస వుండదు...

Tanikella Bharani

అసలింకా నయం... వాళ్ళు మనచుట్టూ తిరిగి అడుక్కుంటున్నారు కొన్నాళ్ళుపోతే పలాన చోటకొచ్చి ముష్టి వెయ్యండి అని పేపరు ప్రకటన గూడా ఇచ్చే అవకాశం వుంది.

ప్రభుత్వం ఆ మధ్య భిక్షాటన నిర్మూలనం అనే పథకం ప్రారంభించి దారుణంగా దెబ్బతింది. సహజం! ఎంచేతంటే అడుక్కోవడం అనేది రాజకీయ నాయకులకి కూడా వెన్నతో పెట్టిన విద్య. బాబూ నా కోటెయ్యండి! అంటే నా కోటెయ్యండి!! అని కాళ్ళా వేళ్ళా పడతారు... సరే అని జాలిపడి వేశామా... ఆ తర్వాతనించీ మనం చిప్పచ్చుకుని తిరుగుతాం వాళ్ళచుట్టూ...

చిత్రం ఏమిటంటే వొకళ్ళు అడుక్కుంటారు... మరొకళ్ళు వాడుకుంటారు... కాబట్టి మొదటవాళ్ళే కొంత నయం!

English summary
Film celebrity and writer Tanikkela Bharani in his 'Samanya Suktam' writes about beggars.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X