తనికెళ్ల 'సామాన్యసూక్తం': అభినవ పూటకూళ్ళు
రాకుమారుడు పులిపాలు తెచ్చుటకు వెళ్ళుట... మజ్జలో పూటకూళ్ళమ్మ వద్దకు వెళ్ళుట... ఆవిడ పంచభక్ష పరవాణ్ణములు పెట్టుటయేకాక రాకుమారిని లేవదీసుకుపోవుటకు సులభమార్గమును సూచించుట! ఇదీ జానపద గాథాక్రమం... పేదరాసి పెద్దమ్మ పోతూ పోతూ పూటకూళ్ళ ఇళ్ళని తీసుకుపోయిందేమో హోటళ్ళు వెలిశాయ్.
కాకా హోటళ్ళు... బాకా హోటళ్ళు... ఇరానీ, ఉడిపి... మలబారు, చైనా..... బ్రాహ్మణ... మిలిటరీ... అలా వర్ణాక్రమ ధర్మాల్ని గూడా పాటించి జాతికోటీ, వర్గానికోటీ ఇంకానయం కాంగ్రెస్ హోటళ్ళనీ కమ్యూనిస్టు హోటళ్ళనీ మొదలెట్టలేదు...

మేలుజాతి హోటళ్ళని చుక్కల హోటళ్ళందురు... అందు చుక్కా... పక్కా గూడా లభిస్తాయంటారు మరి నిజం మనకి తెలీదు...
మా కొంప దగ్గర ఓ హోటలుంది... నారాయణ... నారాయణ... అందులో భోంచేస్తే రౌరవాది నరకాల్ని సందర్శించినంత అనుభూతి కలుగుతుంది... అది సోల్‌ట్రేడర్ బిజినెస్సు... ప్రొప్రైటర్ అతనే మేనేజర్ అతనే క్లీనర్ సర్వర్ కుక్కు అలా పాత్రల్ని తోవడము కాకుండా పాత్రోచితంగా నటిస్తాడు... ఆ చుట్టుప్రక్కల రెండు కిలోమీటర్లవరకూ 'అన్నదాత' వాడే! అంచేతే తప్పక వెళ్ళడం... అదీ ఎప్పుడో! పిండాలెట్టినట్టు మూడు ముద్దలెడ్తాడు... ఓ లిక్విడ్ పోసి అది ''రసం'' అంటాడు... ఇంకో పదార్ధం సామూహిక సాంబార్, అందులో కందమూలములతో పాటు కొంత పచ్చిగడ్డి వేస్తాడు... మరో జేగురురంగు పదార్థం పేరు చట్నీ... నాలిక అతుక్కుపోతుంది... పండుగలకి 'స్వీటు' అని పేరెట్టి మైసూరుపాకం చేస్తాడు... ఆ రోజు దాన్ని దంతక్షయం లేకుండా నమలగలిగితే పండగ చేసుకున్నట్టే!
అన్నం పలుకయిందేమిరా అన్నామా మర్నాడు జావ... మెత్తబడిందేరా అంటే మేకులు... ఈ హోటల్ పక్కనే ఓ క్లినిక్కుంది... ఈ హోటల్‌వల్ల అది బాగుపడ్తోంది... అంచాత భావిభారత యువకులకి కుక్కింగ్‌లో ట్రైనింగ్ ఇస్తే సుఖపడ్తారు వాళ్ళయినా... స్వయంపాకమంత ఉత్తమం లేదని శాస్త్రమే వుందీ!
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications