తనికెళ్ల భరణి 'సామాన్యసూక్తం': చదువు చారెడు...
పూర్వం తాళపత్రాల మీద గ్రంథాలు రాసిపోయేవారు... ఇప్పుడంటే తాటాకులు కేవలం నాలిగ్గీసుకోడానికి ఉపయోగిస్తున్నామనుకోండి. అదీ పల్లెటూళ్ళలో... కానీ ఆ పద్ధతే గనక కంటిన్యూ అయ్యుంటే... బాగుండేది... హాయిగా పెరట్లో నాలుగు తాటిచెట్లు పెంచుకుని... ఆదివారాలు కుర్రాళ్ళకి నోటుబుక్కులు కుట్టిపెట్టేవాణ్ణి!
స్కూళ్ళు తెరుస్తున్నారంటే వొణుకు పుట్టుకొస్తోంది... ఒక్కొక్క కుర్రవెధవకీ బండెలు పుస్తకాలు... అందులో వెరైటీలు సింగల్‌రూళ్ళు... డబుల్‌రూళ్ళు... బ్రాడ్‌రూళ్ళు వీళ్ళ పిండాకూడు రూళ్ళు... సరే ఎల్లాగో చచ్చీచెడీ అప్పుచేసో లోన్‌కి అప్లేయ్ చేసో కొందామన్నా అన్నీ ఒక్కచోట దొరికవ్... సరే ఇంక డ్యూటీ వేసుకుని అన్ని దుకాణాలూ వెతికి పట్టుకున్నాక... వాటికి అట్ట... వాటిమీద లేబుల్స్... ఇవన్నీ కూరి తీసికెళ్ళడానికి ఓ బ్యాగు... సిపాయివాడు యుద్ధానికెళ్తున్నట్టు వెళ్ళారు పిల్లలు స్కూళ్ళకి...

సరే మళ్ళీ కొనకపోతే గోలెత్తుతారనీ జెప్పి కొంటావా... పిల్లలు ఆ పుస్తకాల్ని గవర్నమెంటు ఆఫీసు ఫైళ్లకన్నా అధ్వాన్నంగా తయారుచేస్తారు... వాటినిండా కొట్టివేతలు... గీతలు... పిల్లిబొమ్మలూ కుక్కబొమ్మలూనూ... వీళ్ళ ప్రజ్ఞంతా ఉపయోగించి కాగితపు బాణాలు చేస్తారు... మరీ కుర్రాడయితే ఆ బాణాల్ని మేస్టార్లమీదకీ... ఓ మాదిరి కుర్రాడయితే అమ్మాయిల మీదికీ విసురుతారు.. వానాకాలం వొస్తే... చక్కగా పుస్తకాలు చింపి కాగితం పడవలుచేసి కేరింతలు కొడుతుంటారు.. నీళ్ళలో ఆ కాగితం పడవలు చూసినప్పుడల్లా... అవి రూపాయి కాయితంతో చేసిన పడవల్లా కనిపించి కళ్ళు మూసుకుంటాను.
ఈ విషయంలో మా పెద్దాడే బెటరు... వాడు కేవలం ఒకటే నోటు బుక్కు తీసుకుని ఏదో షికారుకెళ్లినట్లు వెళ్ళొస్తాడు కాలేజీకి... అయితే ఏ మాటకామాటే చెప్పుకోవాలి వాడు ఒక్కపూటన్న ముచ్చటకి నోట్సు రాసుకున్న పాపాన పోడు... లవ్‌లెటర్స్... ప్రేమలేఖలు చెక్కడానికి మాత్రమే పవిత్రంగా వాడుకుంటాడు!
ఈ మధ్య మా ఆవిడకూడా మొదలెట్టింది నోట్సు కొనడం... కొంప తవ్వి రచియిత్రి అవుతుందేమో అని హడలిపోయాను... అబ్బే కాదుట ఎడంవేపు ఇంటిపద్దు... కుడివేపు చాకలిపద్దుట! మా ఆవిడ కొంచెం పొదుపులెండి!
బుక్స్... బుక్స్... బ్లడీబుక్స్... అన్న కవిపుంగవుడెవరోగానీ ఇలాంటి బాధపడ్లేకే అనుంటాడు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications