తణికెళ్ల భరణి 'సామాన్య సూక్తం: స్టార్ డమ్!

జయము...జయము మహారాజా! అని రాజుగారొచ్చినప్పుడల్లా భజన చేసే జంటని మనం జానపద చిత్రాల్లో తరచూ చూస్తూ వుంటాం!

రాజుగారు నిజంగా ఏదైనా రాజ్యాన్ని జయించి రానివ్వండి లేదా చిన్నరాణిగారి తోటి మొహం వాచేట్లుచివాట్లు తిని రానివ్వండి... సభకొచ్చే సరికి జయము...జయము అంటూ భట్రాజులు సిద్ధం ....అందుకోసమే వాళ్ళు ఉద్దేశింపబడ్డారు గనక... అది వాళ్ళ వృత్తి గనకా వాళ్ళని తప్పు పట్టకూడదు.

మనిషన్న ప్రతివాడికీ విజయం సాధించాలి అన్న కాంక్ష ఉంటుంది. చదువులో కావొచ్చు... ఉద్యోగంలో కావొచ్చు... లవ్‌ ఎఫైర్‌లో కావొచ్చు...ఇలా ఏ విషయంలోనైనా సరే...!

అయితే ఆ పని సాధించాలన్న పట్టుదల ఉండాలి... ఆత్మ విశ్వాసం ఉండాలి...చిత్త శుద్ధి ఉండాలి... అంతేకానీ వారఫలాలు చదివేసుకొని ఈ వారం అంతా మనకి బాగానే రాశాడు... మనం ఏమి చెయ్యకపోయినా ఫర్లేదు... జాక్‌పాట్‌ ఖాయం అని చేతులు ముడుచుక్కూర్చుంటే... చేతికి చిప్పే మిగులుతుంది.

Tanikella Bharani

చాలాసార్లు తప్పకుండా విజయం లభిస్తుంది అని మనం అనుకున్నవి బోల్తా పడొచ్చు!... దానికి సవాలక్ష కారణాలు వుండొచ్చు... అవతలి పార్టీ చాల బలమైంది అవ్వొచ్చు. దానికి విపరీతమైన పలుకుబడి వుండొచ్చు.... ఏ కార్యాన్నైనా ఇట్టే సాధించిపారేసే 'క్యాష్‌' వుండొచ్చు.

పూర్వం యుద్ధాల్లో కూడా సైన్యాధిపతి సైనికులను ఉద్దేశించి విజయమో వీరస్వర్గమో తేల్చుకోండి అంటూ ఉత్సాహపరిచేవాడు.... మరి అవతలి సైన్యం కూడా విజయం పొందాలన్న ఉద్దేశంతోటే కదా వొచ్చింది...అయితే కావలసినది ఏమిటయ్యా అంటే నిర్దిష్టమైన పథకం!... అనగా ప్రాపర్‌ ప్లానింగ్‌...

విజయ శబ్దం మీద పిచ్చి మోజున్న వాళ్ళు సినిమా జనం. ఫలాన తార 'జయ' పదం ముందు పెట్టుకుంది గనుకనే అంత స్టార్‌డమ్‌ వొచ్చింది. అన్న గుడ్డి నమ్మకంతో అనేకమంది వర్దమాన తారలు తమ పేరు ముందో వెనుకో అతికినా అతక్కపోయినా 'జయ' పదం తగిలించుకుంటున్నారు.... మరి అందరికి స్టార్‌డమ్‌ ఎలా వస్తుందీ?... కొందరికి స్టార్‌ 'ఢాం' అంటోంది.

ఏదేమైనా ఉన్నతమైన ఆశయాలు ఉద్దేశాలు ఉండి వాటిని త్రికరణశుద్ధిగా ఆచరణలో పెడితే... విజయం సిద్ధిస్తుంది.!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+