తణికెళ్ల భరణి 'సామాన్య సూక్తం': వరవిక్రయం
మహాకవి శ్రీ కాళ్ళకూరి నారాయణరావుగారు వరవిక్రయం అన్జెప్పి అత్యద్భుతమైన నాటకం రాశారు. సబ్జెక్టు వరకట్నం!... అందులోని ఒక్కొక్క డైలాగూ కట్నం పుచ్చుకునేవాళ్ళ మొహంమీద చెప్పుచ్చుకుని కొట్టినట్టుంటుంది. ఏంలాభం... ''సిగ్గా... ఎగ్గా?... ఎన్ని తిట్లు తిన్నా.. ఎన్ని శాసనాలు చేసినా ఇచ్చేవారు ఇస్తున్నారు... పుచ్చుకునేవారు పుచ్చుకుంటున్నారు.
''కన్యాశుల్కం'' రోజుల్లో మీరు ముక్కుకు తాడేసి పుచ్చుకోలేదూ... ఇప్పుడు మా చాన్సొచ్చింది... అంటారు పిల్లాడి తరపువారు అదేదో హక్కు అయినట్లు... సరే! వాళ్ళెవరో గడ్డి తిన్నారని చెప్పి మనమూ తినలేముగా...

ఒక ఆడపిల్ల తల్లితండ్రుల్నీ... బంధువుల్నీ... స్నేహితుల్నీ... తను పుట్టిపెరిగిన పరిసరాల్నీ.... ఆ మధురానుభూతుల్నీ శాశ్వతంగా వదిలేసి ముక్కు మొహం తెలీనివాడితో జీవితాంతం కలిసి వుండేందుకు వొస్తోందంటే ఎంత త్యాగం!... అలా రావడానిక్కూడా ఇంత టాక్స్ కట్టాలనిజెప్పి వాళ్ళ ప్రాణలు తోడితే ఇంక మానవత్వానికి అర్థం ఏవిటీ...?
అప్పుడే అయిందా... అయినకాడికి పిల్లని దారొయ్యాలి... బోల్డుకట్నం... ఎన్నో లాంఛనాలు... పండగలకీ పబ్బాలకీ బట్టలు... అల్లుడు అలిగితే బండి కొనివ్వటం ఏమిటి తంతు అంతేనూ...
యవ్వనంలో వున్న యువకుడు ఆవేశంకొద్దీ... కట్నమా గిట్నమా?... నాన్‌సెన్స్... నాది ఆదర్శవివాహం అన్నా... పెద్దవాళ్ళు చెంపలు వాయించి మరీ పుచ్చుకుంటారు... ''పెద్దోళ్ళమాటంటే గౌరవం''
-
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్!











Click it and Unblock the Notifications