తనికెల్ల భరణి 'సామాన్యసూక్తం': లవ్!
ఎల్... ఓ... వీ... ఇ... ఇది యువతరం పాలిట బీజాక్షరాల్లాంటివండీ! దీన్నే తెలిగిస్తే 'ప్రేమ' అని తేల్తుంది.
పూర్వం ముందు పెళ్ళాడేసి తర్వాత తీరిగ్గా... రహస్యంగా ప్రేమించుకునేవారు... కొన్నాళ్ళు బహిరంగంగా ప్రేమించుకుని బహిరంగంగా పెళ్లి చేసుకునేవారు... ఈ రోజుల్లో పబ్లిగ్గా ప్రేమించుకోవటం మాత్రమే చేస్తున్నారు... పెళ్లి అయేసరికి డల్ అయిపోతున్నారు...
ఈ ప్రేమ... ఎందెందు వెదకి చూసినా మణగులకొద్ది కనిపిస్తోంది... ప్రేమ కవితలు... ప్రేమకథలు... నవల్లు, నాటకాలు... సినీమాలు... సర్వం ప్రేమమయం...
కుర్రాళ్ళ ప్రేమ... కాలేజీ ఆవరణలో మొలకలెత్తి, బస్టాండ్లో చిగురులు తొడిగి... పార్కుల్లో పాకి... ఆటోల్లోనూ స్కూటర్లమీదా ప్రయాణించి... ఎక్కడో ఆక్సిడెంట్‌తో ఆగిపోతోంది!...

ఇక లవ్వుల్లో రకములు... నేత్రలవ్వు... అంటే వొట్టి చూపులే... ఇంకోటి వాచాలవ్వు... కేవలం కబుర్లతో సరి... ఇలా హాసలవ్వు... దరహాసలవ్వు మోసలవ్వు... ఘోషలవ్వు... పరిహాసం లవ్వు... అబ్బో... చాలా చాలా వెరైటీ లవ్వులు...
ఇంకో గమ్మత్తైన లవ్వు... కేవలం ప్రేమలేఖలకే పరిమితం... అంటే ఉత్తి ''ఉత్తర కుమారులు'' అన్నమాట!
మావాడొకడున్నాడు... వాడు వారాలు చేస్తున్నట్టు... సోమవారం... ఒక పిల్లనీ... మంగళవారం మరో అమ్మాయినీ... బుధవారం మరో బేబీని... ఇలా పండగలప్పుడు ఒకర్ని... సెలవులప్పుడు మరొకర్నీ గాఢముగా ప్రేమిస్తాడు... అదేమిట్రా వెధవా అంటే... ప్రేమ గుడ్డిది బ్రదర్ అంటాడు. అలా అనిచెప్పి గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎడా పెడా ప్రేమించేస్తే దవళ్ళు వాయగొట్టరండీ?...
ప్రేమించడం తప్పని కాదు... అదో జబ్బులా సంక్రమిస్తే ప్రమాదం... లవ్వు... హృదయాల్లో పూసే పువ్వు... అంతేగాని కొవ్వు కాదు... కాకూడదూ!...
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications