తనికెళ్ల భరణి 'సామాన్యసూక్తం': కాఫీ రాగం

నాకు బెడ్‌కాఫీ అలవాటు! మంచంమీంచి లేవగానే గొంతులో కాఫీ పడిపోవాలి. లేకపోతే ఆరోజు మూడాఫ్‌ అయిపోయి కన్పించిన వాళ్ళందర్ని చెడామడా తిట్టేస్తాను... మొన్నోరోజు అలాగే జరిగింది! లేచిన అయిదు నిముషాలదాకా వొంటింట్లోంచి గిన్నెల చప్పుడుగానీ... కాఫీ పరిమళంగానీ రాలేదు... హోం మినిస్ట్రీ ఏమన్నా సెలవ ప్రకటించిందేమో అనుకున్నా కాదట... కాఫీపొడి అయిపోయిందట! చూడండీ... కందిపొడి అయిపోయిందనుకోండి, ఆవకాయతో పనైపోయింది... పళ్ళపొడి లేదనుకోండి, కచికెట్టో... వేపరొబ్బ పెట్టో... ఆఖరికి బొగ్గుమక్కు పెట్టో తోముకుంటా... కానీ కాఫీపొడి లేకపోతే!... ఇంకేవుందీ...

ఆ విషయం రాత్రే చెప్పి తగలడొచ్చుగా అన్జెప్పి కేకలేశాను... నా సంగతి సరే... మా ఆవిడకి పొద్దునే మరచెంబుతో కాఫీ తాగకపోతే నీరసం వొస్తుంది... మా చెల్లాయికి కళ్ళు తిరుగుతాయ్‌!... ఇక మా బామ్మర్దికి పిచ్చెక్కినట్టయిపోయి దారమ్మట పోయేవాళ్ళని కరుస్తాడుగూడా... మొత్తానికి పక్కింటివాళ్ళింట్లో అరకప్పు కాఫీపడి అరువట్టుకొచ్చి... కాఫీ యాగాన్ని సాఫీగా జరిపించాం!...

Tanikella Bharani

గానీ ఆ విషయంమీద పలుమారులు ఆలోచించగా నాకు కాఫీ చాలా బ్యాడ్‌హాబ్బిట్టుగా తోచింది!

దురలవాటేగాదు ఎంతడబ్బు క్షవరం... ఎంత శ్రమశక్తి వేస్టు!... పైగా అందులో విషం వుందిరోయ్‌ అని డాక్టర్ల గోలా! పాలు... ఎన్ని తెచ్చినా కాఫీలకే అయిపోతాయి రాత్రికి మజ్జిగుండదు...

పంచదార... క్యూలో తగలడి బ్లాకులో తెచ్చుకోవడం... స్టవ్వు. కిరసనాయిలు... ఫిల్టరు... ఓ పెద్ద పిండివొంట చేసినంత గొడవా, హడావుడీ... వెధవకాఫీ మానేద్దాం అని అంత జాయింటుగా తీర్మానించుకున్నాం.

రెండు మూడ్రోజులు కంట్రోలు చేసుకున్నాను... ఇంక ఆగలేకపోయాను... దొంగతనంగా హోటల్లో తాగి... ఏమీ ఎరుగనివాడిలా కొంపకి జేరేవాణ్ణి!... పాపం మావాళ్ళని చూస్తే జాలేసింది.

గానీ తర్వాత తెలిసింది... నేను ఆఫీసుకి బయల్దేరగానే వాళ్ళు చక్కగా కాఫీ కాచుకునేవారనీ... ఇంక ముసుగులెందుకూ... కలిసే తాగేద్దాం ఆ కషాయమేదో... అంటూ విరమించేకున్నాం...

''అల్లీముఠా'' నాటకంలో అందుకే రాశాడు మహానుభావుడు... కల్లు మేలనిపించె... కాఫీ ఇల్లు సాఫీ వొళ్ళు మాఫీ అనీ-

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+