తనికెళ్ల భరణి 'సామాన్యసూక్తం': ఓనరుడు
పురుషులందు ఉత్తమ పురుషుండ నేనే... అని గీతలో పరమాత్ముడు చెప్పాడు మరి నరులలో ఉత్తమ నరుడెవ్వడయ్య అంటే ఇంటి ఓ నరుడు అని చెప్పాల్సి వస్తోంది. ''జీవితం అద్దెకొంపలాటిదీ... ఉన్నన్నాళ్ళు మనదే అనిపిస్తుంది'' అని రాశారొకాయన... అటువంటి అద్దెకొంపని నానాయాతనా పడి కట్టుకున్న ఓనరుడ్ని మనం గౌరవించాల్సిందే మరి... తను నానా కష్టాలు పడ్డాడు గనుక అద్దెకున్న వాళ్ళని అష్టకష్టాలూ పెట్టాలని రూలైతే లేదుగానీ... పాపం కొంతమంది శక్తివంచన లేకుండా ఇబ్బంది పెడ్తూనే వుంటారు.
ప్రతీకొంపకీ ఓనరుడు వుంటాడు... కొండొకచో ''ఓనరి''యుండును. ఓ నరుడు పుంలింగమయితే, ఓనరి స్త్రీ లింగం... ఇంట్లో అడుగెట్టిన మరుక్షణం కొన్నిరూల్సు పెడతాడు... జీతం వొచ్చినరోజునే అద్దెకట్టుట... రాత్రి పదిగంటల లోపునే ఇంటికి వచ్చుట... చీటికీమాటికీ బంధువులు రారాదూ... గోడలకి మేకులు కొట్టరాదూ... ఫ్యాను పెట్టుకోరాదు... హీటర్ పెట్టుకోరాదూ... రేడియో కూడా హెచ్చుస్థాయిలో పెట్టుకోరాదూ... ఇలా సవాలక్షా...

అన్నింటికీ గంగిరెద్దులా బుర్రూపిన మరుక్షణం... అసలు అద్దె... రెండేళ్ళ అడ్వాన్సు... కరెంటుకో పది ప్లస్ నీళ్ళకో పది బాతురూమ్ ప్లస్ క్లీనింగ్‌కో పది అల్లా అన్నీ ప్లస్సులే... ఇంకా నయం గాలికి వెలుగుకీ అద్దె కట్టమనట్లేదు... అందుకు సంతోషిద్దాం! ఇలా పాలు పొంగించుకున్న లగాయితు సాధింపు మొదలెడతాడు... తలుపులు గట్టిగా వేయకండి... కోళాయి మెల్లిగా తిప్పండి ఊడిపోతుంది!... రాత్రిళ్ళు లైటు అంతసేపు వెలుగుతోందేమిటి అన్నీ బెదిరింపులు...
రెణేళ్ళకోమాటు ధరలు పెరిగిపోతున్నాయ్ అంటాడు జనాంతికంగా...అంటే వచ్చేనెల పదో పాతికో పెంచమనీ సూచన అన్నమాట... మనం మరీ మొండికేస్తే మా అమ్మాయి ట్రాన్స్‌ఫరయి వొస్తోంది... మీరు ఖాళీ చెయ్యండి అని సెంటిమెంట్ మీద కొడ్తాడు... ఛా... ఛా... వెధవగొడవ... చెప్పులోని రాయి... చెవిలోని జోరీగ... ఇంకా ఓనరు పోరు ఇంతింత కాదయా... అనాలనిపిస్తోంది... దీనికన్న... ఏ ఊరిచివరో పాకేసుకుని బ్రతకడం బెస్టు అనికూడా అన్పిస్తుంది... కానీ మనం మధ్యతరగతివాళ్ళమే... అంచేత నామోషీ!
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications