ఎన్టీఆర్ 108 అడుగుల విగ్రహం: నాలుగు డిజైన్లు ఇవే..
నవ్యాంధ్ర రాజధానిలో ఎపి ప్రభుత్వం 108 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొదట ఎన్టీఆర్ విగ్రహాన్నికృష్ణా నది ఒడ్డున కోర్ క్యాపిటల్‌కు అభిముఖంగా ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడా నిర్ణయాన్ని మార్చుకొని ఫైనల్ గా నీరుకొండ వైపు ఏర్పాటు చేయాలని మంత్రివర్గంలో డిసైడ్ చేసేశారు. దీనివల్ల విగ్రహం ఎదుట భారీ జలాశయం ఉండడంతో విగ్రహం నీడ నీటిలో ప్రతిబింబించే అవకాశం ఏర్పడింది.
ఈ నిర్మాణం కోసం నాలుగు ఆకృతులను సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ డిజైన్లను పరిశీలించిన చంద్రబాబు వాటికి మరింత మెరుగులు దిద్ది వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పరిశీలించిన ఆ నాలుగు డిజైన్లు ఇవే....

డిజైన్ 1...స్వాతిముత్యం...
ఎన్టీఆర్ విగ్రహం కట్టడం కోసం రూపొందించిన నాలుగు డిజైన్లలో ఒకటి...స్వాతిముత్యం ఆకృతి...ఈ డిజైన్ లో ఎన్టీఆర్ విగ్రహం పాదాల కింద ఉండే పీఠం ఎత్తే 24 మీటర్లు ఉంటుంది. దాని పైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు...ఆ పీఠం దాని చుట్టూ ఉండే అనుబంధ కట్టడాలు అన్నీ కలసి స్వాతిమత్యం ఆకారంలో రూపుదిద్దుకుంటాయి.

డిజైన్ 2...ముత్యపు చిప్ప ఆకృతి...
ఎన్టీఆర్ స్టాట్యూ కోసం సిఎం చంద్రబాబు పరిశీలించిన రెండో డిజైన్...ముత్యపు చిప్ప ఆకృతి...ఇందులో కూడా ఎన్టీఆర్ విగ్రహం కింద ఉండే పాద పీఠం ఎత్తు 24 మీటర్లే ఉంటుంది. అయితే అనుబంధ కట్టడాలతో కలిపి ఈ డిజైన్ ను ముత్యపు చిప్ప ఆకృతిలో తీర్చిదిద్దడం జరిగింది.

డిజైన్ 3...ప్రదక్షణ ఆకృతి
ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించిన నాలుగు ఆకృతుల్లో ఇది మూడోది...పరిక్రమ ఆకృతిగా పేర్కొంటున్న ఈ డిజైన్ లో ఎన్టీఆర్ విగ్రహం కొండ శిఖరంపై ఉండగా...అక్కడకు చేరుకోవాలంటే కొండ చుట్టూ ప్రదక్షణ చేస్తూ...పైకి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకునే విధంగా మార్గం ఉంటుంది. అందుకే దీన్ని పరిక్రమ లేదా ప్రదక్షణ ఆకృతి గా పేర్కొనవచ్చు. ఈ మోడల్ లో ఎన్టీఆర్ కింద ఉండే పీఠం ఎత్తు 35 మీటర్లు...పీఠం చుట్టూ గ్రీనరీ ఉంటుంది. మొత్తం కట్టఢం 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది.

డిజైన్ 4...కమలం ఆకృతి...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహం కోసం పరిశీలించిన ఆకృతుల్లో ఇది నాలుగవది. ఈ డిజైన్ మొత్తం పరిక్రమ ఆకృతినే పోలివున్నాఎన్టీఆర్ విగ్రహానికి దిగువన ఉండే పీఠం మాత్రం కమలం ఆకృతిలో ఉంటుంది. అంటే కమలం లో నుంచి ఎన్టీఆర్ ఉద్బవించినట్లుగా ఈ డిజైన్ ను రూపొందించడం జరిగింది. ఇందులో కూడీ పీఠం ఎత్తు 35 మీటర్లుగా తెలుస్తోంది...సో...ఇవండీ...నవ్యాంధ్ర రాజధానిలో తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు...దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం కోసం రూపొందించిన ఆకృతులు...
-
లెక్క మారుతోంది, ఇక నుంచి - టార్గెట్ ఫిక్స్ చేసిన చంద్రబాబు..!! -
ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు తప్పదు, ముహూర్తం ఫిక్స్..!! -
అమరావతి వేదికగా అరుదైన నిర్మాణం, తెలుగు వైభవాన్ని చాటేలా..!! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..!












Click it and Unblock the Notifications