అమెరికాలో తెలుగు విద్యార్థులకి షాక్: ఎన్నో కారణాలు
హైదరాబాద్: ఇటీవల అమెరికాలో అడుగుపెడుతున్న పలువురు తెలుగు విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించారు. దీని పైన అమెరికాలోని తెలుగు సంఘాలు, నిపుణులు తెలుగు విద్యార్థులకు పలు సూచనలు చేస్తున్నాయి. వీసా అంటే ఆహ్వానం మాత్రమేనని గుర్తు చేస్తున్నారు.
ఉన్నత చదువులకు వీసా రావడమంటే కేవలం అమెరికా వచ్చేందుకు ఇచ్చే అనుమతి మాత్రమేనని, ఈ అంశాన్ని విస్మరించవద్దంటున్నారు. సిలికాన్ వ్యాలీ వర్సిటీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయంలో చేరేందుకు వచ్చిన పలువురు విద్యార్థులను ఇటీవల వెనక్కు పంపడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
భద్రతా అధికారులు అడిగే ప్రశ్నలకు విద్యార్థులు స్పష్టంగా, నిజాయతీగా సమాధానాలు చెప్పకపోవడం వంటి కారణాలతోనే వారిని తిప్పి పంపుతున్నట్లు అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధులకు అక్కడి అధికారులు చెబుతున్నారని తెలుస్తోంది.
అంతేకాకుండా, విద్యార్థుల్లో కొందరికి ఆంగ్లంలో పట్టులేకపోవడం ప్రధాన సమస్యగా మారిందని, అధికారులు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇంగ్లీషులో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నట్లుగా చెబుతున్నారని తెలుస్తోంది. వాటితో పాటు సరైన ధ్రువపత్రాలు చూపకపోవడం, ఆర్థిక అంశాలపై వివరాలు చెప్పలేకపోవడమూ కారణం.

అమెరికాలో ఎక్కడ ఉండబోతున్నారు, ఉండటానికి అయ్యే ఖర్చును ఎలా భరిస్తారు, కాలేజీ ఫీజును ఎలా చెల్లిస్తారు, బీమా సౌకర్యం ఉందా, వీటన్నింటికీ ఆర్థిక సహకారం ఎక్కడి నుంచి వస్తుంది... తదితర ప్రశ్నలు అధికారుల నుంచి ఎదురౌతుంటాయని, వాటికి సరైన సమాధానం చెప్పవలసి ఉంటుందంటున్నారు.
పార్ట్ టైం ఉద్యోగం చేసి సంపాదించుకుంటామని, సమీప బంధువుల ద్వారా ఆర్థిక సాయాన్ని పొందుతామని చెప్పడం లాంటివి చేయవద్దంటున్నారు. కాగా, అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థుల్లో భారతీయుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.
ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి అమెరికా వచ్చే విద్యార్థుల్లో 2014-15లో 11 శాతం పెరుగుదల నమోదైంది. ఏటా చైనా నుంచి వచ్చే వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. ఈసారి భారత విద్యార్థులు ఆ రికార్డును అధిగమించారు. భారత్ నుంచి వచ్చే విద్యార్థుల్లో 29.1 శాతం పెరుగుదల నమోదైంది.
కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 18 మంది విద్యార్థులను శనివారం నాడు అధికారులు హైదరాబాదుకు తిప్పి పంపించారు. వారిని న్యూయార్క్ విమానాశ్రయం నుంచి తిప్పి పంపించారు. మూడు వివిధ ఎయిర్ లైన్స్ ద్వారా వారు తిరిగి వచ్చారు.
-
హైదరాబాద్‌లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications