ఫాలో అప్
సాధారణంగా మీడియాలో పనిచేస్తున్న వారికీ, మీడియా యజమానులకు పాఠకులు చైతన్య స్థాయిపై నమ్మకాలు తక్కువగా వుంటాయి. సమాచారంపై తమకున్న గుత్తాహక్కు కారణంగా తాము చెప్పిందే పాఠకులు విశ్వసిస్తారనే ధీమా వారిలో వ్యక్తమవుతుంది. బిట్వీన్ ది లైన్స్ చదివే తెలివితేటలు పాఠకుల్లో వుంటాయని వారు అనుకోరు. అర్ధం చేసుకున్న పాఠకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం కూడా తక్కువే. ఒకవేళ ఎవరైనా తమ అభిప్రాయాలను అసమ్మతిని తెలియజేస్తూ ఉత్తరాలు రాసినా అవి చెత్తబుట్టలోకి వెళ్లిపోతాయి. అయితే ఇంటర్నెట్ ఎడిషన్స్ విషయం అలాకాదు. పాఠకుల చైతన్య స్థాయి చాలా ఎక్కువ. ఏ విషయమైనా మొహంమ్మీద గుద్దినట్టుగా అప్పటికప్పుడు మెయిల్ చేసేవారి సంఖ్య చాలా ఎక్కువ. వాటిని నిరోధించే అవకాశాలు కూడా కొన్ని సందర్భాల్లో ఎవరికీ వుండవు.












Click it and Unblock the Notifications
