పాఠకుల మాట

Posted By:
Subscribe to Oneindia Telugu

ప్రసాద్‌ గారి వ్యాసాన్ని వింగడించి, ముక్కలు ముక్కలు చేసి సమాధానం ఇచ్చే తెలివి నాకు లేదు. కానీ కొన్ని విషయాలను స్పష్టం చేయాల్సిన అవసరం మాత్రం ఉన్నది. నాకు ఆయన అనేక ఉద్దేశాలు అంటగట్టారు. ఆయన అనుకున్నట్లు నాకు వేరే ఉద్దేశ్యాలు ఏమీ లేవు. ఇంకా చెప్పాలంటే భాష పేరు చెప్పి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే వాదనే నా దృష్టిలో తప్పు. భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల ఏర్పాటు తప్పనేది నా అభిప్రాయం. చారిత్రక, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాల ప్రాతిపదికపై విభజన జరగాలి లేదా కలిసి ఉండాలనేది నా అభిప్రాయం. అని నేను భావిస్తాను. అందువల్ల గ్లాసు కూడా పాతదే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి