హైదరాబాద్ అంత్రాక్స్ బాధ
ఇదిగో కవరంటే అదిగో అంత్రాక్స్ పోకడతో నగరం అల్లాడిపోతున్నది. ఈ వ్యవహారం మాస్ హిస్టిరియాకు దారితీసే ప్రమాదం వున్నదని మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నారు. అమెరికాను గడగడలాడిస్తున్న అంత్రాక్స్ హైదరాబాద్‌లో ప్రత్యక్ష్యం కావడం ఏమిటీ? ఇందులో నిజానిజాల పాలు ఎంత ? వ్యవహారాన్ని అక్కడికక్కడ తేల్చే మౌలిక సదుపాయ మన హైటెక్, నాలెడ్జీ నగరంలో లేవు. వచ్చిన కవర్లను ఢిల్లీకి పంపి నిజం నిగ్గుతేల్చి వారం రోజుల్లో తాడోపేడో తేలుస్తామంటున్నారు. అంతవరకు పుకార్లు, వార్తలతో జనం కంటిమీద కునుకులేకుండా గడుపాల్సిందే. చంద్రబాబునాయుడు పాలన ప్రారంభమైన తర్వాత హైదరాబాద్ కేవలం హైటెక్ సిటీగా, షాపింగ్ స్థావరంగా మారింది తప్ప అంతకు ముందు పాలకులు కట్టుకున్న పుణ్యం వల్ల నగరంలో నానా రకాల జాతీయ స్థాయి శాస్త్రీయ పరిశోధన కేంద్రాలు అనేకం వెలిసాయి.












Click it and Unblock the Notifications