వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వజ్రాలగని ఆంధ్రావని

By Staff
|
Google Oneindia TeluguNews

విజయరామారావుకుడి.శ్రీనివాస్‌ బాకీ!!!
చెట్టు మీది కాయకూ సముద్రంలో ఉప్పుకీ ఏమిటి సంబంధం?రాజకీయాల్లో ఏదైనా సంభవమే. సిబిఐ మాజీడైరెక్టర్‌ కె.విజయరామారావు రాజకీయాల్లోకి రాకపోయిఉంటే డి.శ్రీనివాస్‌ ఈనాడు పిసిసి అధ్యక్షుడు అయి ఉండేవాడుకాదు. ఈ స్టేట్‌ మెంత్‌ వింతగా ఉండవచ్చు కానీ చాలావరకు నిజం. విజయరామారావు రాష్ట్రంలోనే అతిపెద్దదైనఖైరతాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ దిగ్గజమైనపి. జనార్ధనరెడ్డిని ఓడించడంతో రాజకీయాల్లో కొత్తఅయినా అనివార్యంగా ఆయనకు కేబినెట్‌ మంత్రిపదవి ఇవ్వవలసి వచ్చింది.

అప్పటికేవెలమ కులానికి చెందిన విద్యాధరరావు,కె.చంద్రశేఖరరావు చాలా కాలంగా మంత్రులుగాఉన్నారు. పెద్దగా సంఖాధిక్యత లేని ఒక కులానికిచెందిన ముగ్గురిని కేబినెట్‌ మంత్రులుగా కొనసాగించలేకచంద్రశేఖరరావుకు డిప్యూటీ స్పీకరు పదవిఅప్పగించవలసి వచ్చింది. అప్పటి వరకు తెలంగాణవెనుకబాటు తనం గురించి మాట్లాడని చంద్రశేఖరరావుడిప్యూటీ స్పీకరు లాంటి పవర్‌ లేని పదవిలోఉండలేక తిరుగుబాటు బావుటా ఎత్తారు. ఆయననాయకత్వంలోని టీఆర్‌ ఎస్‌ తెలంగాణసామాన్యుల్లో ఒక శక్తిగా ఎదగడంతో కాంగ్రెస్‌ నాయకులు తెలంగాణకు ప్రత్యేక పిసిసి కావాలనడంమొదలు పెట్టారు. అనేక కారణాల వల్ల తెలంగాణ పిసిసికి ఒప్పుకోనిఅధిష్టానవర్గం తెలంగాణకు, బిసి వర్గానికిచెందిన డి.శ్రీనివాస్‌ కు అనివార్యంగా పిసిసి పదవిఅప్పగించవలసి వచ్చింది. లేకపోతే పిసిసి పదవిఆంధ్రకు చెందిన ఎన్‌ జనార్ధనరెడ్డి లాంటివాళ్ళు ఎగరేసుకుపోయి ఉండేవారు. అందుకే విజయరామారావు గారికిడి.శ్రీనివాస్‌ అనుకోకుండా రుణపడి ఉన్నట్టులెక్క.

స్టార్‌ఫెస్టివల్‌

అది ఆగష్టు 14 అర్ధరాత్రి. అమీర్‌పేటలో కొత్తగా వచ్చిన పార్క్‌ ఇన్‌ హోటల్‌ లోని ప్రధాన రెస్టారెంట్‌లో నార్త్‌ ఇండియాకు చెందిన కొన్ని ధనిక కుటుంబాల గెట్‌టుగెదర్‌. బర్త్‌ డేకాదు మ్యారేజి పార్టీ కాదు. స్వాతంత్ర్యదినోత్సవం. ముప్పై ఏళ్ళ ఒక యువతి స్లీవ్‌ లెస్‌వేసుకుని ఉంది. ఆమె తెల్లటి సున్నితమైన భుజాలమీద మువ్వన్నెల జెండా డిజైన్‌. ఆమె భర్తనున్నగా గీయించికున్న గుండు మీద కూడా జాతీయ జెండాడిజైన్లే. వారిలో దేశభక్తి ఇంతగా పొంగిపోర్లడాన్నిఅభినందించాల్సిందే. కానీ మద్యం కూడా అక్కడ పొంగిపొర్లడాన్నిఏమనుకోవాలో?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X