వాహ్ అమితాబ్, గ్రేట్ బ్లాగ్ !

విదేశాల్లో ఆత్యున్నత స్దాయి అధికార్లు,నాయకులు ప్రజలకు చేరువవ్వడానికి బ్లాగు అత్యుత్తమ మార్గంగా భావిస్తున్నారు. కానీ ఇండియాలో మాత్రం బ్లాగింగ్ ఇంకా రాజకీయ నాయకుల దాకా చేరలేదుకానీ ఈ మద్యే అమితాబ్ సినీ నటులను చులకన చేసి మాట్లాడిన పలువురు రాజకీయ నాయకులను "ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి నటించేవార"ని తన బ్లాగ్ లో చాలా ఘాటుగా విమర్శించారు. రాజకీయ నాయకులు బహిరంగ సభలో మైకు పెట్టి వాగిన దానికన్నా నిస్సందేహంగా అమితాబ్ బ్లాగిందే ఎక్కువ మందికి చేరింది. షారుఖ్ కి కూడా బాలివుడ్ షెహన్ షా తన బ్లాగ్ ద్వారానే చురకలంటించారు. అమీర్ ఖాన్ ఇటీవలే తను కొత్తగా కొన్న "బంగ్లా వాచ్ మెన్ కుక్క పేరు షారుఖ్"అని బ్లాగి మరో వివాదానికి తెరతీశారు. ఆయన ఉద్దేశ్యం ఏమైనా అది వివాదానికి దారి తీసింది. అనంతరం ఆయన షారుఖ్ కి క్షమాపణ చెప్పినా బాలీవుడ్ తారల మనస్పర్దలను ఇది మరోసారి బయటపెట్టింది. అమితాబ్ కూడా తారల రాతలను వక్రీకరించొద్దని నెటిజన్లకు విఙ్ఞప్తి చేసారు. నెటిజన్ల నుండి ప్రశంసలు, విమర్శలు రెండూ వస్తాయని రెంటినీ స్వీకరించడానికి సిధ్దంగా ఉండాలని అమితాబ్ అనుభవం. బాలివుడ్ సంగతి అలా ఉంచితే మేధావులు నుండి మొదలుకొని ప్రతి ఒక్కరూ తమ అనుభవాల్ని, అభిప్రాయాల్ని, అభిరుచుల్ని ప్రపంచంతో పంచుకోడానికి బ్లాగింగ్ ని చక్కని సాధనంగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications