• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎడారి పక్షులకు దిక్కెవరు ?

By Staff
|

గల్ఫ్ దేశాల్లో ఉంటున్న తెలుగువారి కష్టనష్టాలపై, ప్రస్తుత సమస్యలకు పరిష్కార మార్గాలపై రాజ్ పాల్ రావు, GTWCA టిడిఎప్ డిస్కషన్ బోర్డులో సవివరంగా రాశారు. పాఠకులకు, పాలకులకు ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఇస్తున్నాం.

ఒకటి కాదు రెండు కాదు, గత 30-35 సంవత్సరాలనుంచి గల్ఫ్ దేశాలకు, (ముఖ్యంగా GCC దేశాలు, అంటే UAE, Saudi, Oman, Bahrain, Qatar, Kuwait) మన దేశం నుంచి చాల మంది వలస వెళ్లారు. మరి వారు ఎటువంటి వీసాల పైన వెళ్తున్నారు? వారికి ఏమయినా skill ఉందా? లేక కూలీ పనికి వెళ్తున్నారా? వాళ్ళకి ఏమయినా లీగల్ సమస్యలు వస్తే ఎవరిని కాంటాక్ట్ చేయాలి? వాళ్ళు తీసుకున్న వీసాలు సరియినవా కాద? ఇవన్ని తెలుసుకోవాల్సిన బాధ్యతా ప్రభుత్వానికి ఉందా లేదా? ఎంత మందిని ఎందరు అగేంట్లు మోసగించారో ప్రత్యక్షంగా గణాంకాలు లేకపోయినా, ఇక్కడ పలికించిన ప్రతివాని నోట ఏజెంట్ల మోసాల గురించి వింటుంటే, అది ఎంత పెద్ద మోసమో ఊహించోకోవచ్చు. మరి మన ప్రభుత్వానికి ఇదేం పట్టదా ? మన ఆంధ్ర ప్రదేశ్ నుండే అనధికారిక గణాంకాల ప్రకారం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లినవారి సంఖ్య కొన్ని లక్షల్లో ఉంటుంది, రమారమి 5, 10 లక్షలు అనుకుంట. మరి ఇన్ని సంవత్సరాలనుండి ఇన్ని లక్షల మంది వెళ్తూ తామూ సంపాయించిన పైసా పైసా కూడబెతు తమ కుటుంబీకులకు పంపిస్తున్నా దానితో మన గత, ప్రస్తుత ప్రభుత్వాలూ ఎంత లబ్ధి పొంది ఉంటాయి? అనధికారిక లెక్కల ప్రకారం ఇలా పంపిన సొమ్ము సంవత్సరానికి కొన్ని కోట్లల్లో ఉంటుంది. మరి ఇన్ని కోట్లు పంపుతున్న ఆ బడుగు జీవులు కోసం మన ప్రభుత్వాలూ ఏమి చేశాయని అడిగితే, అదొక పెద్ద ప్రశ్న.

అటు రోజుకో చేనేత కార్మికుడు లేదా రైతు - పట్టించుకుంటే, అట్టుడుకుతున్న రాష్ట్ర సమస్యలు ఇటు గల్ఫ్ బాధితులు - పట్టించుకుంటే, అట్టుడుకుతున్న రాష్ట్ర, జాతీయ సమస్య కేవలం 4 నెలల్లో కనీసం 60 మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన, గల్ఫ్ దేశస్తులు ముద్దుగా పిలుచుకునే "బ్లూ కాలర్ వర్కర్స్", అదే లబర్లు మరణించడం నిజంగా ప్రభుత్వం సిగ్గుపడవలసిన విషయం. ఐతే, ఈ లెక్కలు కేవలం వివిధ వార్తా పత్రికలలో వచ్చినవి మాత్రమె. మరి, ఇట్లా వార్తలకు నోచుకోని మరణాలెన్నో, మృతదేహాలు ఎన్నో, మరెన్నో ... ఆ ఆలోచనే కడు బాధాకరంగా ఉంది.

ప్రపంచీకరణ అనిగాని, liberalisation అని గాని, పేరు ఏదైనా, ఈ ప్రగతి రథచక్రాల కింద ఈ అభాగ్యులు ఇలా నలిగిపోవల్సిందేనా? వీరంతా చేసిన పాపం ఏందీ? తెలంగాణ లో పుట్టడమేనా, లేక చేతగాని, ముందుచూపులేని వారిని తమ ప్రతినిధులుగా చట్ట సభలకు పంపడమా?

ఒక్కసారి ఈ గల్ఫ్ కు వెళ్ళే వల్ల సమస్యను పరిశీలిస్తే, ఉన్న ఊర్లో జీవనోపాధి కరువై, చేసేందుకు పని లేక యువత ఎడారి దేశాలకు దారి పడుతున్నారు. ఈ క్రమంలో నకిలీ ఏజెంట్ల చేతులలో మోసానికి గురి కావడమో, అలా గురైన కొందరు ఆత్మహత్యలు చేసుకోవడం, గల్ఫ్ దేశాలకు వచ్చిన తరవాత ఇక్కడి పరిస్థితులకు ఇమడ లేక ఆత్మహత్యలు చేసుకోవడమో, ఇక్కడి వాతావరణానికి తట్టుకోలేకనో, ఆరోగ్య సమస్యలతో మరణించడమో లేదా పని చేసే చోట, రోడ్డు ఆక్సిడెంట్లలో మరణించడమో జరుగుతుంది. ఒక్క మనిషి చనిపోతే, అతడు చేసిన అప్పు, అతని మీద ఆధారపడిన కుటుంబం, వారి పోషణ, పిల్లల ఆలన పాలనా, ఇవన్ని చేయలేని ఆ ఇంటి ఆడవాళ్ళూ రోడ్డున పడడం తద్వారా సామాజిక సమస్యలు ఎక్కువనే అయితున్నాయి కాని తగ్గడం లేదు. ఐతే, కర్మ కాలి ఆ జీవి కాస్త విగత జీవుడైతే, అతడిని గుర్తించి కనీసం శవాన్నైనా పంపే ఏర్పాటు లేదు, పంపే ఏర్పాటు పక్కన పెట్టండి, కనీసం గుర్తించే ఏర్పాటు లేదు. అలాంటి విగత జీవులు గల్ఫ్ దేశాల ఆసుపత్రుల్లో ఉన్నారు. వారిని ఎవరైనా గుర్తించి పంపిస్తే, అలంటి వారి దహన సంస్కారాలు జరుగుతున్నాయి, లేకపతే ? మరి ప్రభుత్వం యొక్క ఈ అలసత్వం ఎవరికీ మంచిది? కుటుంబానికి నలుగురి చొప్పున అనుకున్నా, ఇప్పుడు మనం పైన చెప్పుకున్న 60 మంది మీద ఆధారపడ్డ కనీసం 240 మంది ఆధారం కోల్పోయినట్టే కదా. మరి వారి జీవనోపాధి, వారి నిత్యావసరాలు ఇవన్ని ఎవరు చూస్తారు? ప్రకటించిన exgretia వస్తుందో లేదో తెల్వది, వచినా అది వారికి అందుతుందో లేదో తెల్వది.

గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి దగ్గర ఏజెంట్లు ఎంత దండుకున్తున్నారో జగమెరిగిన సత్యం. ఒక్కొక్క మనిషి Rs. 100.000 - Rs. 150.000 వెచ్చించి వీసా తీసుకొని వస్తున్నాడు, మరి ఇంత సొమ్ము ఆ కష్ట జీవుల దగ్గర ఎక్కడిది అంటే, భార్య మెడలో పుస్తెల కాడి నుంచి, ఉన్న పొలము అమ్మి మరి కొంత అప్పు చేసి ఏజెంట్లకు కడుతున్నారు. మరి కన్న వాళ్ళని, కట్టుకున్న భార్యని, కన్నా పిల్లలని వొదిలి దేశం కాని దేశం వచ్చినవారి పరిస్థితి ఏందయ్యా అంటే, ఒకరోజు తిని, మరొక రోజు ఉపవాసాలు ఉంటూ, ఎండకు ఎండి, సోమ్మసిల్లుకుంటూ భవన నిర్మాణ కూలీలుగా పనులు చేస్తున్నారు, వారి పరిస్థితి కడు దయనీయం. ఇక్కడ నిర్మించే ప్రతి భవనంలో మన తెలుగువాడి చెమట బొట్లు కలిసయంటే అది అడిసయోక్తి కాదేమో. ఇంత చేసి, ఇంత కస్టపడి వారు సంపాయించేడి ఎంతయ్య అంటే Rs. 4000 - Rs. 8000. అలా ఏజెంట్లు ఇచ్చిన కొన్ని వీసాలు ట్రాన్సిట్ వీసాలు, అంటే 15 రోజులవరకే వాటికి గుర్తింపు, వచ్చిన వాళ్ళు ఆ గడువు లోపల దేశం విడిచి వెళ్ళాలి. అలంటి వారు చట్టవ్యతిరేకంగా అదే దేశంలో ఉండి ఆ పని ఈ పని చేసుకుంటూ అందులో కొంత కూడబెట్టుకుంటారు. పోలీసుల కంటపడకుండా జాగ్రత్త పడాలి కూడా. ఎవరైనా పని చేయించుకొని డబ్బులు ఎవకున్న అడిగే అధికారం కూడా ఉండదు, ఎందుకంటే ఎదుటివాడికి తెలుసు, వీడు అక్రమంగా దేశం లో ఉంటున్నాడని. రెండోరకం వీసా, విజిట్ వీసా, 2 నెల్ల వరకు ఉంటుంది, మల్లి కొంత సొమ్ము కడితే, మొరో నెల వరకు పోదిగిస్తారు. ఆ సమయంలో ఏదన్న జాబు వెతుక్కొని రెసిడెన్స్ వీసా సంపాయించాలి, లేదా మల్లి కదా మొదటి కేసు లో లాగా పునరావృత్తం అవుతుంది. మూడో రకం, కొన్ని కంపెనీలు అక్కడే interveiw లు చేసి, ఇంత జీతం ఇస్తామని వారితో ఒప్పందం కుదుర్చుకొని వారి దగ్గర కొంత డబ్బు దండుకొని ఉద్యోగాలు ఇస్తారు. మరి తీర ఇక్కడి వచ్చిన తరవాత, చెప్పినంత జీతం ఇవ్వకపొవడమో, లేదా 4-6 నెలల వరకు జీతం ఇవ్వకపోవదమో, కొన్ని సందర్బాలలో రెండు విధాలుగా కూడా కావచ్చు. ఇంకొక విషయం, ఇక్కడికి వచ్చాక, మన పాస్ పోర్టును ఆ కంపెనీకి అప్పగించాలి. అది ఆ కంపెనీ ఆధీనంలోనే ఉంటుంది. మరి వీరి జీవన స్థితి గతులు (living conditions) ఎలా ఉంటాయంటే, ఒక్కొక్క చిన్న రూమ్ లో 10-12 మంది, మరి కొందరైతే 20-25 మంది వరకు ఉంటారు. వీరందరికీ ఒక్కే బాత్రూం. రూమ్స్ కూడా మరీ పెద్దగ ఏమి ఉండవు. వీరి మానసిక పరిస్థితి అంతతమాత్రమే, ఎంతో మంది నిరాశానిస్పృహలోకి వెళ్ళడం చాల కామన్, ఈమధ్య సుయిసైడ్ కేసెస్ కూడా బాగా పెరిగి పోతున్నాయని ఒక్క వినికిడి.

గడిచిన 30-35 సంవత్సరాలనుంచి ఎ ఒక్క ప్రభుత్వం కూడా ఈ గల్ఫ్ సమస్యను పట్టిచుకోకపోవడం యాదృచ్ఛికమేనా, లేక మన నేతలకు కొరవడిన ముందు చూపా? మరి ఇన్ని సంవత్సరాలనుంచి ఇప్పటివరకు ఏ ఏ పల్లె నుంచి ఎంత మంది ఏ ఏ దేశాలలో ఉన్నారో మన ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవంటే అతిశయోక్తి కాదేమో. మరి ఆ లెక్కలు ఎందు లేవు అంటే సమాధానం, ఒక్క పెద్ద ... ???

పక్క రాష్ట్రం, మనతో పోలిస్తే ముప్పావు వంతూ కూడా లేని కేరళ రాష్ట్రం ఈ విషయంలో ఎంతో ఆడర్శనీయమనే చెప్పాలి. అక్కడి ప్రభుత్వం గల్ఫ్ వెళ్ళే వారియొక్క వివరాలను సేకరించి, వారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని, మరి వారి యొక్క ఆదాయ వనరుల వల్ల కేరళ రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందిదో గమనించి ప్రవాసితుల కోసమై Department for Non-Resident Keralites Affairs (Norka) ని December 1996 లో స్థాపించిది. అక్కడి ప్రభుత్వం, ప్రవాస కేరలీయుల మధ్య ఈ సంస్థ వారది గా పనిచేస్తున్నది. Norka కు మరో బాధ్యత కూడా ఉంది, అదే "strict action against illegal recruitment. " మరి మనదగ్గర ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటుంది.

మరి Norka చేస్తున్న పనులేంటో ఒక్కసారి చూద్దాం:

1) Pravasi Insurance Scheme - ప్రవాసి ఇన్సురన్సు స్కీమ్ M/s న్యూ ఇండియా అస్సురన్స్ కంపెనీ వారి సాహియోగంతో May 1997 లో మొదలైంది. అటుతరవత, దేశాలో ఉండిపోయిన ప్రవాస కేరలీయుల కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని 'Pravasi Suraskha Kutumba Arogya Scheme' మొదలు పెట్టారు.ఈ స్కీమ్ కింద వారి కుటుంబాల మెడికల్ క్లైమ్స్ వర్తింప చేసినారు. ఇంక, Pravasi Vanitha Suraksha Scheme, ఇది బయటి దేశాలలో పని చేసే ఆడవారికోసం.

NORKWA: తమ వృత్తలు వొదులుకొని లేదా రిటైర్ అయ్యి వచ్చిన వారి కోసమై కేరళ ప్రభుత్వం Non Resident Keralites Welfare Agency (NORKWA) అనే సంస్థను June 1998 లో ఏర్పాటు చేసింది. ఈ సంస్థ బాద్యత, - తిరిగి వచ్చిన ప్రవాసితుల అనుభవాన్ని ఉపయోగించుకోవడం, తద్వారా, కేరళలో పారిశ్రామిక అభివృద్ధి ని సాధించడం.

Emergency repatriation fund: వివిధ కారణాల వల్ల బయటి దేశాలలో చిక్కుకున్న మలయాళీలను సురక్షితంగా తీసుకురావడానికి ఏర్పాటు చేసిన నిధి.

Pravasi pension scheme: ప్రవాసితుల కోసమై కేరళ ప్రభుత్వం LIC of India వారి సహకారంతో పెన్షన్ స్కీమ్ ను అమలు చేసే ఆలోచనలో ఉంది.

మరి మన దగ్గర ఒక్క NRI కమిటీ వేసారు, అది నామమాత్రంగానే లేదా అసలు పనిచేయడం లేదనే చెప్పాలి. నిధులు లేనిదే ఈ సంస్థ కూడా పనిచేయదు. మరి ఈ సమస్యను ఎందుకు ఇలా వదిలేస్తున్నారు, ఎందుకు దాని మీద శ్రద్ధ లేదు. అటువంటప్పుడు, అది ఇంక పెద్ద సమస్యగా మారి మరిన్ని సమస్యలకు ఉతమవుతుందని ఎందుకు మన పరిపాలకులు గ్రహించడం లేదు.

ఈ క్రమంలో ప్రభుత్వం అసలు సమస్యను గుర్తించడంలో విఫలమైందనే చెప్పాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ సమస్య పై పరిశీలన జరిపి, ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి, దీనికి కొంత నిధిని సమకూర్చితే సర్వదా ప్రశంసనీయం. ఒక్క మనిషి గల్ఫ్ వెళ్తున్నాడు అంటే, గ్రామ, మండల లేదా జిల్లా స్థాయిలో అతని వివరాలను, అతడు ఏ కంపెనీ లో పనికి వెళ్తున్నాడు, జీతం ఎంత, ఉండడానికి ఇల్లు కంపెనీ వారు ఇస్తున్నారా లేదా, అతని పని వివరాలు తెలుసుకొని డేటాబేసు రూపొందిచుకుంటే బాగుంటుందని నా అబిప్రాయం. ఐతే, చదువు లేని వారికి విజిట్ వీసాల పై ప్రయాణాన్ని నిషేధించడమో, వీసా ఇవ్వకుండా చేయడమో ఉత్తమం. అటువంటి వారు గల్ఫ్ దేశాలకు వచ్చి కల్లి వెళ్లి అక్రమంగా ఉంటూ అక్కడి ప్రభుత్వానికి, సంఘానికి ఒక సమస్యగా మారుతున్నారే తప్ప వారి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ప్రత్యామ్నాయంగా, అటువంటివారికి అక్కడే స్వయం ఉపాధి పథకాల కింద ఏదన్న ట్రైనింగ్ ఇప్పించి ఉపాధి కలిపిస్తే ఉత్తమంగా ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X