రక్షకులనే డబ్బులడిగిన రష్దీ

వింబుల్డన్ హోంలో తన రక్షణ కోసం గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు రష్దీకి సాయుధ రక్షణ బాధ్యతలను ఇవాన్స్ కు అప్పగించారు. ఆ సమయంలో గట్టి రక్షణ కల్పించారు. కొడుకు జాఫర్ కూడా రష్దీని కలవడానికి చాలా కష్టమయ్యేది. ఒక సందర్భంలో ఆసియా న్యూస్ పేపర్ డెలివరీ బాయ్ ని తీవ్రవాదికి అనుమానించి అతన్ని కాల్చి చంపేంత పని జరిగింది. ఇదంతా చేసి తన రక్షణ బాధ్యతలు తీసుకున్నందుకు తనకు డబ్బులు ఇవ్వాలని రష్దీ డిమాండ్ చేసేవారని ఇవాన్స్ తెలిపారు. లాడ్జింగ్ అలవెన్స్ కింద రష్దీకి రక్షణ బృందం ఒక రాత్రికి పది పౌండ్లు చెల్లించినట్లు ఆయన తెలిపారు. అయితే వాటిని టాక్స్ పేయర్ తిరిగి చెల్లించినట్లు ఆయన తెలిపారు. ఫుడ్ అలవెన్స్ కింద అదనంగా 16 పౌండ్లు చెల్లించినట్లు ఆయన చెప్పారు. రష్దీ రక్షణకు తాము చెల్లింపులు చేస్తున్నామా, టాక్స్ పేయర్ చేస్తున్నారా అర్థమయ్యేది కాదని ఆయన అన్నారు. ఒక సందర్భంలో తాము తమ గదులకే పరిమితమయ్యేవారమని, రష్దీకి జో అని సంకేత నామం ఇచ్చామని, అతను గర్ల్ ఫ్రెండ్ ను, మూడో భార్య ఎలిజబెత్ వెస్ట్ ను కలవడానికి అవకాశం కల్పించేవాళ్లమని ఆయన వివరించారు.
ఒక రాత్రి తాను, తన సహచరులు వైన్ సేవించామని, మరింత వైన్ కోసం వెళ్లామని, కొన్ని సీసాలు కనిపించాయని, రష్దీ అనుమతి అడిగామని, అయితే ఆ రచయిత సీసాకు 45 పౌండ్లు అడిగారని ఆయన తన ఆత్మకథలో రాశారు. రష్దీ ప్రవర్తనకు తమ సిబ్బంది తీవ్ర నిస్పృహకు గురయ్యారని ఆయన చెప్పారు. ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారని, దాంతో మెట్ల కింది కప్ బోర్డులో పెట్టి స్థానిక పబ్ కు వెళ్లారని, తిరిగి వచ్చిన తర్వాత రష్దీని బయటకు తీశారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications