ర్యాగింగ్ లో ఆంధ్ర ఫస్ట్

ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాన్ని వామపక్ష పార్టీలు అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్ ఆక్రమిస్తోంది. పశ్సిమ బెంగాల్ లో పది కేసులు నమోదు కాగా, ఉత్తరప్రదేశ్ లో పది, పంజాబ్ లో 8 కేసులు నమోదైనట్లు ర్యాగింగ్ వ్యతిరేక ప్రభుత్వేతర సంస్థ క్యూర్ వెల్లడించింది. నిరుడు జులై నుంచి ఈ ఏడాది జూన్ వరకు ర్యాగింగ్ కు 12 మంది మరణించినట్లు ఆ సంస్థ అధ్యయనంలో తేలింది. ర్యాగింగ్ భూతాన్ని అరికడతామని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, యుజిసి, ఇతర నియంత్రణ సంస్థలు హామీలు ఇస్తున్నప్పటికీ పరిస్థితి మెరుగు పడలేదని క్యూర్ ప్రతినిధి హర్ష్ అగర్వాల్ అన్నారు.
గత విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో 12 ర్యాగింగ్ కేసులు నమోదయ్యాయని, నాలుగు మరణాలు సంభవించాయని, ఒకరు ఆత్మహత్యకు పాల్పడారని ాయన చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ లో వైద్య విద్యార్థిని అమన్ కచ్రూ మృతితో ర్యాగింగ్ పై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ర్యాగింగ్ నిరోధానికి చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications