నాపై మత వివక్ష: హష్మీ

లక్ష రూపాయల టోకెన్ మొత్తాన్ని చెల్లించిన తర్వాత కూడా సొసైటీ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తోందని ఆరోపిస్తూ హష్మీ ఫిర్యాదు చేసినట్లు కమిషన్ వైస్ చైర్మన్ అబ్రహం మథాయి చెబుతున్నారు. సొసైటీకి సమన్లు జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ తల్లిదండ్రులు సొసైటి సభ్యులను కలవడానికి గతవారం వెళ్లారని, నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం విక్రయదారు, బ్రోకర్లతో వారు వెళ్లారని, అయితే తమకు తీరిక లేదని సొసైటీ సభ్యులు చెబుతూ కలవడానికి నిరాకరించారని, దీంతో తన మనోభావాలు దెబ్బ తిన్నాయని హష్మీ అంటున్నారు.
తమకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వబోమని, తాము విక్రయాన్ని అపేశామని సొసైటీ సభ్యులు చెప్పినట్లు విక్రయదారు సువర్ణ చెప్పినట్లు ఆయన తెలిపారు. సొసైటీలో చాలా మంది హిందువులు, కొంత మంది కాథలిక్కులు ఉన్నారని, దాంతో ముస్లింలం అయినందున తమకు ఇల్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని హష్మీ అంటున్నారు.
తమకు హష్మీ నుంచి లేఖ అందిందని, అయితే సొసైటీ అధ్యక్షుడు అందుబాటులో లేనందున ఇప్పటి వరకు దానిపై నిర్ణయం తీసుకోలేదని హౌసింగ్ సొసైటీ కార్యదర్శి చత్రి ఒక ఆంగ్లదినపత్రిక ప్రతినిధితో అన్నారు. ముస్లింలకు నిషేధమేదీ లేదని, ముస్లింలందరూ టెర్రరిస్టులు కారని తమకు తెలుసునని, దేశంలోని అన్ని రకాలవారు ఇక్కడ ఉంటారని, తాను దేశంలోని వేరే ప్రాంతం నుంచి వచ్చినవాడినని, ఎవరు వస్తున్నారనేది అందరికీ తెలియాల్సిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు.
సొసైటీ మేనేజింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న నటుడు అనిల్ ధావన్ వాదన మరో రకంగా ఉంది. హష్మీ తన పొరుగువాడిగా రావడం తనకు ఆనందంగా ఉంటుందని, సొసైటీ సమావేశం జరుగుతుండగా హష్మీ కుటుంబ సభ్యులు కార్యాలయంలోకి దూసుకొచ్చారని, అందువల్ల వారిని కలవడానికి తాము నిరాకరించామని, సెలిబ్రిటీ అయినంత మాత్రాన ఏదైనా చేయవచ్చుననేది మంచిది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications