వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలీవుడ్ లో భార్యల సెగలు

By Staff
|
Google Oneindia TeluguNews

ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందని అంటారు. బాలీవుడ్ లో విజయాలు సాధిస్తున్న నటులను చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. షారూఖ్ ఖాన్ బార్య గౌరీ ఖాన్ ఓం శాంతి ఓంలో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సినిమాకు ఆమె నిర్మాత కూడా. ఆమె తానేమిటో నిరూపించుకోవడానికి సిద్ధపడింది.

అందాల సుందరి ఐశ్వర్యారాయ్ గురించి చెప్పనే అక్కర్లేదు. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకున్న ఆమె తన సినిమాల్లో నటిస్తూనే ఉంది. మధ్య వయస్సులోనూ కుర్రకారు అభిమాన నటిగా మన్ననలు అందుకుంటూనే ఉంది. అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన మొదటి బాలీవుడ్ నటిగా కూడా ఆమెను చెప్పుకోవచ్చు. ఇక, జయా బచ్చన్ గురించి కూడా చెప్పుకోవాలి. అమితాబ్ బచ్చన్ ను పెళ్లి చేసుకున్న ఆమె ఇప్పుడు నిండా రాజకీయాల్లో మునిగిపోయారు. సమాజ్ వాదీ పార్టీ పార్లమెంటు సభ్యురాలిగా ఆమె తన బాధ్యతలు నిర్వహిస్తోంది.

అమీర్ ఖాన్ గజినీ సినిమాతో 2008లో అతి పెద్ద స్టార్ గా ముందుకు వచ్చాడు. ఆయన భార్య కిరణ్ రావు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించే ఆలోచనలో ఉంది. అమీర్ ఖాన్ తో కలిసి ఆమె సినిమాలకు పని చేసింది కూడా. రితిక్ రోషన్ భార్య సుజన్నే బాలీవుడ్ వైపు ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. కానీ ఆమె దృష్టి ఇప్పుడిప్పుడే ఇటు వైపు మళ్లుతోందట. సంజయ్ దత్ తన భార్య మాన్యతను పబ్లిక్ గా ముందుకు రాకుండా చాలా కాలం చూశాడు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం సంజయ్ మాన్యత భర్తగానే గుర్తింపు పొందుతున్నాడు.

అర్బాజ్ ఖాన్ భార్య మలైకా అరోరా ఖాన్ బాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్. ఆమెకు సల్మాన్ ఖాన్ తో సంబంధాలున్నాయనే ప్రచారం ఉంది. షారూఖ్ ఖాన్ తోనూ స్నేహం కొనసాగిస్తోంది. సల్మాన్, షారూఖ్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నప్పటికీ ఆమె ఇద్దరితోనూ తన స్నేహాన్ని కొనసాగించ గలుగుతోంది. టెన్షన్లు, వివాదాలు చెలరేగినప్పటికీ ట్వింకిల్ ఖన్నా అక్షయ్ కుమార్ ను వివాహమాడింది. పెళ్లయిన తర్వాత అక్షయ్ కుమార్ కు గర్ల్ ఫ్రెండ్ శిల్పా శెట్టి కంటికి అనకుండా చేయగలిగింది. దాదాపు దశాబ్దం తర్వాత శిల్పా శెట్టి, అక్షయ్ కుమార్ బిగ్ బాస్ షోలో వేదికను పంచుకున్నారు.

సూపర్ స్టార్ అయిన కాజోల్ అజయ్ దేవగన్ భార్య అయింది. కూతురు కోసం ఆమె నటనను వదులుకుంది. మళ్లీ ఆమె తన నట జీవితాన్ని కొనసాగించే ఉద్దేశంతో ఉంది. షారూఖ్ తో కలిసి నటించేందుకు ఒక సినిమాకు ఆమె అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. మాధురీ దీక్షిత్ కు బాలీవుడ్ వైఫ్ గా పేరుంది. ఆమె భర్త సినిమా పరిశ్రమకు చెందినవాడు కాదు. పెళ్లయిన తర్వాత ఆమె కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా లాభం లేకపోయింది.

ఇక హేమమాలిని గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఇప్పటి బాలీవుడ్ భార్యలకు ముందు తరం నటే అయినప్పటికీ అందాన్ని కాపాడుకోవడంలో ఆమె ఆదర్శంగా నిలుస్తోంది. అంతేకాకుండా తన భర్త ధర్మేంద్ర కన్నా విజయవంతమైన స్త్రీగా నిలిచింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X