సుందర్ పై కోనేరు హంపి వార్

ప్రపంచ నెంబర్ టూ అయిన హంపి తన ఆరోపణలను ధ్రువీకరించే పత్రాలను కూడా మీడియాకు విడుదల చేసింది. తనకు కోచ్ గా వ్యవహరిస్తున్న తన తండ్రి కోనేరు అశోక్ కు అనుమతి నిరాకరిండచడంతో ఆమె ఇంతకు ముందు ఆసియన్ ఇండోర్ ఛాంపియన్ షిప్ పోటీల నుంచి తప్పుకుంది. సుందర్ పై కేంద్ర క్రీడా మంత్రికి ఫిర్యాదు చేసేందుకు కూడా ఆమె సిద్ధపడుతోంది. హంపీ చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని సుందర్ అంటున్నారు.
తన తండ్రితో తప్ప మరో కోచ్ తో తాను సౌకర్యంగా ఉండలేనని హంపీ అంటోంది. అతను లేకుండా ఇటలీలోని తురిన్ లో 2006 చెస్ ఒలింపియాడ్ లో పాల్గొన్నానని, దాంతో తాను విఫలమయ్యానని ఆమె చెప్పింది. ఈ మేరకు ఆమె సుందర్ కు ఒక బహిరంగ లేఖ రాసింది.
తన తండ్రిని తన వెంట కోచ్ గా అంగీకరిస్తూ ఎయిర్ ఫేర్ వంటి ఇతర సౌకర్యాలు కల్పించడానికి సుందర్ నిరాకరించారని ఆమె చెప్పింది. అయితే అది ఆ సౌకర్యాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదని తన ప్రాధాన్యతలను పట్టించుకోకుండా టోర్నమెంటుల్లో పాల్గొనాలని సుందర్ పెడుతున్న ఒత్తిడికి సంబంధించిన సమస్య అని ఆమె అన్నది. భారత్ లో తన పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆమె ఆరోపించింది. ఇందుకు సంబంధించిన పలు ఘటనలను ఆమె ఉదహరించింది.












Click it and Unblock the Notifications