బెనజీర్ తో ఇమ్రాన్ రోమాన్స్?

వారిద్దరికి పెళ్లి చేయడానికి కూడా ఇమ్రాన్ తల్లి ప్రయత్నించిందని, కానీ ఫలితం లేకపోయిందని ఆయన ఆరోపించారు. ఇమ్రాన్, బెనజీర్ భుట్టో వ్యక్తిగతంగా, రాజకీయంగా ప్రత్యర్థులుగానే వ్యవహరించారు. మరణానికి ముందు ఇమ్రాన్ ఖాన్ బెనజీర్ ను తీవ్రంగా విమర్శించారు. తన పుస్తర రచన కోసం సాన్ ఫోర్డ్ ఇమ్రాన్ ఖాన్ ను, ఆయన మాజీ భార్య జెమిమాను ఇంటర్వ్యూ చేశాడు.
21 ఏళ్ల వయస్సులో లేడీ మార్గెట్ హాల్లో చదువుతున్న బెనజీర్ 1975లో ఇమ్రాన్ కు దగ్గరైందని విశ్వసనీయంగా తెలిసినట్లు ఆ రచయిత రాశాడు. ఇమ్రాన్ ను లాయిన్ ఆఫ్ లాహోర్ గా మొదట పిలిచింది భుట్టోనే అని సమాచారం. రెండు నెలల పాటు వారిద్దరు అత్యంత సన్నిహితంగా మెలిగినట్లు ఆ రచయిత డైలీ మెయిల్ తో చెప్పినట్లు టెలిగ్రాఫ్ పత్రిక రాసింది. అయితే ఇమ్రాన్ ఖాన్ ఆ రాతలను ఖండించాడు. భుట్టోతో తనకు లైంగిక సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
సాన్ ఫోర్డ్ తనను ఇంటర్వ్యూ చేసినట్లు ఇమ్రాన్ అంగీకరించారు. అతను రాసినదానితో తనకు సంబంధం లేదని, అధి అధికారికం కాదని ఆయన డైలీ మెయిల్ తో అన్నారు. తనకు భుట్టోతో లైంగిక సంబంధం ఉన్నట్లు, తన తల్లి పెళ్లికి ఏర్పాటు చేసినట్లు రాసిందంతా నాన్సెన్స్ అని, తాము మిత్రులం మాత్రమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications