ఇలేష్ ను రాఖీ వదిలేస్తుందా?

రాఖీ కా స్వయంవర్ ద్వారా ఎంపిక చేసుకున్న వరుడు ఇలేష్ పై రాఖీ చేస్తున్న వ్యాఖ్యలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇలేష్ ను పెళ్లి చేసుకోవడానికి బదులు పథకం ప్రకారం అతన్ని వదిలించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలేష్ సోదరి పెళ్లికి ఆమె డుమ్మా కొట్టింది. ఆ తర్వాత గతంలో అతని సంబంధాలను ప్రశ్నించడం మొదలు పెట్టింది. ఇలేష్ కు తాను తగిన దాన్ని కానని చెప్పింది.
రియాల్టీ షో ద్వారా పెళ్లి చేసుకునే ఉద్దేశం రాఖీకి ఎప్పుడూ లేదని అంటున్నారు. రాఖీ, ఇలేష్ తగిన విధంగా విడిపోతారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రాఖీ తలుచుకుంటే ఏదైనా సాధ్యమని చెప్పడానికి వెనకాడాల్సిన అవసరం ఏమీ లేదు.












Click it and Unblock the Notifications