సల్మాన్, షారూఖ్ వార్

అయితే తాజాగా అమెరికాలోని విమానాశ్రయంలో షారూఖ్ నిర్బంధం వీరిద్దరి మధ్య కొత్త వివాదాన్ని సృష్టించింది. సూపర్ స్టార్ అయినంత మాత్రాన, అందరికీ తెలిసినంత మాత్రాన షారూఖ్ ను నిర్బంధించడం అంత పెద్ద డీల్ ఏమీ కాదని సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించి పాత శత్రుత్వానికి కొత్తగా ఆజ్యం పోశాడు. ఈ వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు షారూఖ్ ఖాన్ తనదైన వ్యంగ్యశైలిలో ప్రతిస్పందించాడు. తమ తలుపులు తాము మూసుకునే వారికి అది సాధారణమేనని, తనకు మాత్రం ఇది తొలిసారి అని, తనకు అది చెడుగా కనిపించిందని, మరోసారి జరిగితే అలా ఉండకపోవచ్చునని షారూఖ్ అన్నాడు. దీన్ని బట్టి ఖాన్ ల మధ్య మాటల యుద్ధం ఉందని అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications