గవాస్కర్ కు సచిన్ సాటి రాడా?

గవాస్కర్ జట్టు కెప్టెన్ గా ఉన్నప్పుడు జట్టులో సగం మంది ముంబైవారో, మరాఠీవారో ఉండేవారని ఆయన అన్నారు. జుల్ఫికర్ పార్కర్, సురు నాయక్ వంటి వారికి కూడా ఒక్క టెస్టుకో, రెండు టెస్టులకో గవాస్కర్ అవకాశం కల్పించారని ఆయన అన్నారు. నిజమైన మరాఠీగా గవాస్కర్ వ్యవహరించారని, అయినా గవాస్కర్ ను దేశమంతా అభిమానించిందని ఆయన అన్నారు. సచిన్ డబ్బులు సంపాదించుకున్నాడని కూడా ఆరోపించారు. క్రికెట్ క్రీడ వల్ల సచిన్ ధనవంతుడయ్యాడని, ఆయన ఆస్తి 200కోట్ల రూపాయలకు మించుతుందని శివసేన ఎంపీ అన్నారు. బెంగాల్ వాడిగా సౌరవ్ గంగూలీ గర్వపడుతున్నట్లుగానే మహారాష్ట్రవాడిగా సచిన్ గర్వపడాలని ఆయన అన్నారు. రాహుల్ ద్రవిడ్ మరాఠీవాడే అయినా కర్నాటకకు విధేయంగా ఉంటున్నాడని ఆయన రాశారు.
సునీల్ గవాస్కర్ కాలంలో ముంబై క్రీడాకారులు క్రికెట్ జట్టులో అధిపత్యం చెలాయించేవారనడంలో సందేహం లేదు. ఆ సమయంలో దేశంలో మిగతా ప్రాంతాల నుంచి జట్టు కూర్పుపై విమర్శలు వస్తుండేవి. కొంతకాలం బెంగుళూర్ ఆధిపత్యం చెలాయించిందని, ఇప్పుడు ఢిల్లీ క్రీడాకారులదే ఆధిపత్యమనే విమర్శలున్నాయి. ఏమైనా సచిన్ టెండూల్కర్ ఇంత వరకు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఆయన వ్యాఖ్యలు కూడా మహారాష్ట్ర రాజకీయాలు ప్రాంతీయ విద్వేషాలతో అట్టుడుకుతున్న సందర్భంలో వెలువడ్డాయి. తాను భారతీయుడినని అన్నంత మాత్రాన మహారాష్ట్రను సచిన్ తక్కువ చేస్తున్నాడని చెప్పలేం. ఆయన ప్రాంతీయ రాజకీయాల నినాదాలను వ్యతిరేకించాడంతే.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications