యువీ లైఫ్ లో స్త్రీలు

బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో యువీ సన్నిహితంగా ఉన్న పలు ఫొటోలు వెబ్ లో దర్శనమిస్తున్నాయి. యువరాజ్ ఉన్న ఐపియల్ జట్టుకు ప్రీతి జింటా యజమాని అనే విషయం తెలిసిందే. మరో బాలీవుడ్ నటి దీపికా పడుకొనేతో కలిసి తిరుగుతూ అతను పలుమార్లు పట్టుబట్టాడు కూడా. వారిద్దరి మధ్య డేటింగ్ జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. అంతే కాకుండా మహేంద్ర సింగ్ ధోనీతో సన్నిహితంగా మెలుగుతున్న సమయంలో దీపికా పడుకొనేను యువీ తన వైపు లాక్కున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. అయితే వారిద్దరితో సంబంధాలను దీపికా పడుకొనే ఖండిస్తూ తాను బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ను ప్రేమిస్తున్నట్లు ప్రకటించింది.
బాలీవుడ్ నటి కిమ్ శర్మతో యువీకి ఉన్న సంబంధాలు అందరికీ తెలిసిందే. వారిద్దరి మధ్య తగాదాలు జరిగి విడిపోయారు. తన ప్రైవేట్ లైఫ్ గురించి మాట్లాడడానికి యువీ పెద్దగా ఇష్టపడడు. మరో నటి రియాసేన్ తో కూడా అతను కలిసి తిరిగినట్లు వినికిడి. యువీ షమితా శెట్టిల మధ్య డేటింగ్ జరిగినట్లు కూడా తెలుస్తోంది. అంతే కాకుండా యువీ హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జాతో కూడా కలిసి తిరిగాడు. తన మోకాలి నొప్పికి చికిత్స కోసం ఫిజిషియన్ ను చూపింది యువీయేనని సానియా చెప్పింది. సానియాతో కలిసి యువీ కొన్ని పార్టీలకు కూడా హాజరయ్యాడు.
ఇటీవలే, యువీ, మినిషా లాంబా పలు సార్లు హోటల్లో కలిసి కనిపించారు. ఈ విషయాన్ని ఒక ప్రముఖ దినపత్రిక వార్తగా రాసింది. వివిధ స్త్రీలతో కలిసి తిరుగుతూ సంచలనాలకు కేంద్రంగా మారిన యువీ మాత్రం తాను సింగిల్ గానే ఉన్నానని, అలా ఉండడాన్నే ఇష్టపడుతున్నానని కొద్ది నెలల క్రితం చెప్పాడు.












Click it and Unblock the Notifications