అమెరికా స్ట్రగుల్, ఇండియా బెటర్

Jobs are back in India
ఉద్యోగాల కల్పనలో అమెరికా ఇంకా సతమవుతుండగా భారత్ లో మాత్రం అవకాశాలు పెరుగుతున్నాయి. మొత్తం ఆసియా దేశాల్లోనే ఉద్యోగావకాశాలు మెరుగైనట్లు ఓ సర్వేలో తేలింది. 61 వేల ఇంటర్యూలు చేసి ఈ విషయాన్ని తేల్చారు. మొత్తం 36 దేశాల్లో సర్వే చేయగా 23 దేశాల్లో ఉద్యోగాల పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. భారత్ వంటి దేశాల్లో ఈ పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంది. ఈ దేశాల్లోని కంపెనీలు స్థానికులను, నిపుణులను పెద్ద యెత్తున చేర్చుకుంటున్నాయి. చైనాలో పరిస్థితి ఐదేళ్ల క్రితం ఉన్న పరిస్థితికి, భారత్ లో రెండేళ్ల క్రితం ఉన్న పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి పొంతనే లేదు. జపాన్ లో వరుసగా నాలుగో తృతీయంలో కూడా పెరుగుదల కనిపించింది. అయితే, జపాన్ లో అతి తక్కువగా ఉంది. రాజకీయ అస్థిరత అందుకు కారణమై ఉండవచ్చునని అంటున్నారు.

వచ్చే కొద్ది మాసాల్లో అమెరికాలో పెద్ద యెత్తున ఉద్యోగాల కల్పన సాధ్యమయ్యేట్లు లేదని సర్వే తేల్చింది. మూడో తృతీయలో అమెరికా నెట్ ఎంప్లాయ్ మెంట్ అవుట్ లుక్ ప్లస్ - 6 మాత్రమే ఉంది. అయితే ఇది కొద్దిపాటి పెరుగుదలనే సూచిస్తోంది. గత సర్వేలో అది ప్లస్ - 5 ఉంది. అమెరికాలో ప్రస్తుత పరిస్థితి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. లాటిన్ అమెరికాలోని బ్రెజిల్ లో పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. మెక్సికో కూడా ఫరవా లేదు. ఐరోపా దేశాల్లో కూడా పరిస్థితి అంత బాగా లేదు. చాలా తక్కువ మంది ఉద్యోగులను కంపెనీలు చేర్చుకుంటున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్ డమ్ వంటి దేశాల్లోని కంపెనీలు మాత్రం వచ్చే మూడు నెలల కాలంలో మరింత మందిని చేర్చుకుంటామని చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+