కిరణ్ కు బెంగళూర్ ప్లాట్ పోటు

కిరణ్ కుమార్ రెడ్డి కొనడానికి ముందు ఆ భూలావాదేవీ సక్రమంగా జరగలేదనే ఆరోపణలున్నాయి. అది షెడ్యూల్ కులానికి చెందిన కుటుంబానికి ఇనాం భూమి. రిటైర్డ్ ఐటిఐ ఉద్యోగి హెచ్. వెంకటేష, అతని కుటుంబ సభ్యులు ఆగస్టు వరకు ఎకరాల 26 గుంటల భూమిని సాగు చేసుకుంటూ వస్తున్నారు. ఓ రోజు ఆ భూమికి బలప్రయోగంతో ప్రహరీగోడ నిర్మించారు. అప్పటి నుంచి తన భూమి కోసం వెంకటేష పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ స్థితిలో ఆ భూమి కిరణ్ కుమార్ రెడ్డి చేతికి మారింది. ఆ భూమిని వెంకటేష పెద్దలకు 1983లో ఇనాం నిషేధ చట్టం కింద తిరిగి ఇచ్చారు. చట్ట ప్రకారం ఆ భూమిని 1998 వరకు విక్రయించకూడదు. పదిహేనేళ్ల పాటు దాన్ని విక్రయించకూడదు. అందుకు విరుద్ధంగా ఆ భూమి చేతులు మారింది.
ఆర్థిక ఇబ్బందుల వల్ల నారాయణ రెడ్డి అనే వ్యక్తి వద్ద ఇప్పు చేసినట్లు, దాని కింద 1995 విక్రయనామా రాసుకున్నట్లు వెంకటేష చెబుతున్నాడు. వడ్డీ కింద సగం పంటను ఇస్తూ వెళ్లామని, అయితే విక్రయనామాను ఉపయోగించుకుని నారాయణ రెడ్డి ఆ భామిని తమకు తెలియకుండా 15 ఏళ్లు దాటకుండానే 1995లో ఓ మహిళకు విక్రయించాడు. ఆ మహిళ నుంచి భూమిని కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఆనంద్ అనే వ్యక్తి కొన్నారు. ఐదు భాగాలుగా చేసిన ఆ ప్లాట్ ను అయిదు లావాదేవీల ద్వారా 2000 జూన్ 6, 12, 13 తేదీల్లో కిరణ్ కుమార్ రెడ్డి కొనుగోలు చేశాడు. అప్పుడు దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అక్రమ విక్రయ లావాదేవీల కారణంగా రెవెన్యూ ఎంట్రీల్లో మార్పు చేయకూడదని బెంగళూర్ అర్బన్ జిల్లా మాజీ స్పెషల్ డిప్యూటీ కమిషనర్ రామె గొడ 2007, 2008ల్లో బెంగళూర్ తూర్పు తాలూకా తహిశీల్దార్ ను ఆదేశించారు. ఆ తర్వాత గౌడ స్థానంలో వచ్చిన హెచ్ రామాంజనేయ వివాదం పెండింగులో ఉండగానే 2007లో ల్యాండ్ కన్వర్షన్ ఆర్డర్స్ ఇచ్చారు. అందుకు గాను, 50 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా రామాంజనేయను లోకాయుక్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
భూ లావాదేవీలకు చెందిన 1983 ల్యాండ్ రీ గ్రాంట్ ఆర్డర్ ఒరిజినల్, రెడ్డి సేల్ డీడ్, ఆర్టీసి, మ్యుటేషన్ రికార్డులు, ఎంక్యుబ్రనస్ సర్టిఫికెట్, బెంగళూర్ అర్బన్ జిల్లా స్పెషల్ డిప్యూటీ కమీషనర్లు రాసిన లేఖలు తమ వద్ద ఉన్నాయని వార్తాకథనాన్ని ప్రచురించిన బెంగళూర్ మిర్రర్ తెలిపింది. ఆ భూమిని విక్రయించదలిచినట్లు కిరణ్ కుమార్ రెడ్డి అనుచరులు ప్రచారంలో పెట్టినట్లు, దాని ధర రెండు కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పినట్లు బెంగళూర్ మిర్రర్ తెలిపింది. పత్రాలను తనిఖీ చేసినప్పుడు అవి చాలా క్లియర్ గా ఉన్నాయని, అందువల్లనే కొనుగోలు చేశారని, ఇప్పుడు ఆ భూమిని అమ్మదలిచామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపినట్లు కూడా రాసింది.












Click it and Unblock the Notifications