లలిత్ మోడీ బలం?

Lalit Modi
ఐపియల్ చైర్మన్ పదవి నుంచి తాను తొలగేది లేదని లలిత్ మోడీ మొండిగా చెబుతూనే ఉన్నారు. తనకు మద్దతుగా నిలిచిన కేంద్ర మంత్రి, బిసిసిఐ ఉపాధ్యక్షుడు శరద్ పవార్ చెప్పినా ఆయన వినేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. బిసిసిఐ పాలక మండలి ఒక్కటై లలిత్ మోడీని దిగి పోవాలని చెబుతోంది. అధికార కాంగ్రెసు పార్టీ మొత్తం లలిత్ మోడీకి వ్యతిరేకంగానే ఉంది. శశి థరూర్ వ్యవహారాన్ని బయట పెట్టి ప్రభుత్వాన్ని, పార్టీని ఇరకాటంలో పెట్టిన లలిత్ మోడీపై కాంగ్రెసు వర్గాలు మండి పడుతున్నాయి. కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం కూడా లలిత్ మోడీకి అక్షింతలు వేసినట్లు తెలుస్తోంది. మరో వైపు ఐటి దాడుల ద్వారా లలిత్ మోడీని ఇబ్బంది పెట్టేందుకు కూడా ప్రభుత్వం పూనుకుంది. అయినా లలిత్ మోడీ దిగి రావడం లేదు. ఇంత గట్టిగా లలిత్ మోడీ వ్యవహరించడానికి గల కారణమేమిటనేది ప్రశ్న. ఆయన వెనక ఏ విధమైన బలం ఉందనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐపియల్ జట్ల యాజమాన్యాల మద్దతే లలిత్ మోడీ తన బలంగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

ప్రముఖ వాణిజ్యవేత్త విజయ మాల్యాతో పాటు శిల్పా శెట్టి, షారూఖ్ ఖాన్ లలిత్ మోడీని గట్టిగా సమర్థిస్తున్నారు. ఇతర జట్ల యజమానులు కూడా ఆయనకు అండగా ఉన్నారు. ఐటి దాడులకు సంబంధించినంత వరకు అది ప్రభుత్వ వ్యవహారమని, ఐపియల్ కు సంబంధించినంత వరకు లలిత్ మోడీని మించినవారు లేరని జట్ల యజమానులు అభిప్రాయపడుతున్నారు. తాను లలిత్ మోడీని సమర్థిస్తానని, ఐపియల్ లలిత్ మోడీ బ్రెయిన్ చైల్డ్ అని శిల్పా శెట్టి అంటున్నారు. వెనక ఎవరైనా బురద చల్లుతుంటే ఆ విషయం తనకు తెలియదని, అది ఎటు దారి తీస్తుందనేది పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని, వాటిపై అభిప్రాయాలు చెప్పలేమని, దోషులెవరైనా శిక్షించాల్సిందేనని ఆమె అంటున్నారు. రాజస్థాన్ రాయల్స్, కోల్ కత్తా నైట్ రైడర్స్, కింగ్స్ పంజాబ్ ఎలెవన్ జట్లలో లలిత్ మోడీకి రహస్య వాటాలున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో శిల్పా శెట్టి ఆ ప్రకటన చేశారు.

అయితే, బిసిసిఐ పాలక మండలి లలిత్ మోడీని ఐపియల్ కమిషనర్ గా తప్పించాలనే ఉద్దేశంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనను గౌరవప్రదంగా తప్పించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, బలమైన జట్ల యజమానులు బిసిసిఐ నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే, ఐపియల్ కమిషనర్ గా వైదొలగినా ఆయనకు జరిగే నష్టమేమీ లేదని అంటున్నారు. క్రికెట్ కమ్ ఎంటర్ టైన్ మెంటు బిజినెస్ నుంచి ఆయన తప్పుకునే అవకాశాలు మాత్రం లేవు. బిసిసిఐ కొత్త ఐపియల్ మండలిని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. దానికి క్రికెట్ కు సంబంధించిన వ్యక్తిని సిఇవోగా నియమించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+