షోయబ్ బయట పడ్తారా?

అయేషా ఆరోపణలపై పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. అయితే, షోయబ్ ను అరెస్టు చేసే విషయంలో మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అయేషాను షోయబ్ పెళ్లి చేసుకున్నట్లు, వారిద్దరు కలుసుకున్నట్లు గట్టి సాక్ష్యాధారాలున్నాయని అయేషా తరఫు న్యాయవాది రెహ్మాన్ అంటున్నారు. నిఖానామాపై సంతకాలను ధ్రువీకరించుకోవడానికి పోలీసులు దాన్ని పరీక్షలకు పంపారు. మహా అనే పేరుతో తనను అయేషా కుటుంబం మోసం చేసిందని షోయబ్ అంటున్నాడు. అయితే ఆమె పేరు మహా సిద్దిఖి అలియాస్ అయేషా సిద్దిఖి అని రెహ్మాన్ అంటున్నారు.
షోయబ్ పై హైదరాబాదులోని బంజారా హిల్స్ పోలీసు స్టేషనులో మూడు కేసులు నమోదయ్యాయి. వాటిలో ఒకటి మోసం చేసిన కేసు కాగా, మిగతా రెండు వేధింపులకు, మరోదానికి చెందింది. చివరి రెండు కేసులు కూడా నాన్ బెయిలబుల్ కేసులు. షోయబ్ తో తాను కలిసిన విషయాన్ని ఆజర్ చూశాడని అయేషా పోలీసులకు చెప్పింది. అయితే తాను అయేషాను చూడలేదని, ఆమె ఎవరో తెలియదని అజర్ అంటున్నాడు. అయితే ఇదొక్కటి మాత్రమే బలమైన ఆధారం కాదు. నిఖానామాపై సంతకాలు, ఫొటోలు, పెళ్లి సాక్షులు వంటివి ఆధారాలు కావచ్చు. వాటి నుంచి షోయబ్ తప్పించుకోవడం కష్టమనే అభిప్రాయం వినిపిస్తోంది.
కాగా, ఈ నెల 15వ తేదీన సానియా, షోయబ్ వివాహాన్ని నిర్ణయించారు. అయితే ఈ పెళ్లి జరుగుతుందా, లేదా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. షోయబ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, తనకు బహిరంగంగా విడాకులు ఇవ్వాలని అయేషా అడుగుతోంది. తనకు డబ్బులు అవసరం లేదని కూడా అంటోంది. ఈ విషయంలో షోయబ్ నిర్ణయం మీదనే భవిష్యత్తు పరిణామం ఆధారపడి ఉంటుంది.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications