మీ భాషలో మీ మొబైల్ లో వార్తలు చదవండి

భారతీయ భాషల్లో నెంబర్ వన్ పోర్టల్ వన్ ఇండియా డాట్ ఇన్ మొబైల్ లో ఐదు భాషల్లో వార్తలను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1500 జిపిఆర్ఎస్ హ్యాండ్ సెట్లను సపోర్టు చేస్తుంది. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో వార్తలను చదవడానికి న్యూస్ హంట్ అప్లికేషన్ అనుమతిస్తుంది. అత్యంత వేగంగా పెరుగుతున్నవేదిక అండ్రాయిడ్ ను కూడా అత్యధునాతన వర్షన్ అయిన ఈ అప్లికేషన్ సపోర్టు చేస్తుంది.
ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా వార్తలను, ఎంటర్ టైన్ మెంటు విషయాలను వారి వారి సొంత భాషల్లో చదువుకోవచ్చు. ఎప్పటికప్పుడు తమ తమ ప్రాంతాలకు చెందిన వార్తలను చదువుకోవటానికి ఎన్నారైలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది.
12 శాతం మంది భారతీయులు మాత్రమే ఆంగ్లభాషను సునాయసంగా అర్థం చేసుకోగలరని, మిగతా మెజారిటీ భారతీయులు తమ తమ భాషల్లో విషయాలు కావాలనుకుంటారని, 1, 2 స్థాయి నగరాల్లో ప్రాంతీయ భాషల వాడకందార్లు పెరుగుతున్నారని, రెండోస్థాయి నగరాల్లో లో కాస్ట్ డేటా ప్లాన్సు అందుబాటులో ఉన్నవారు, ఎల్లవేళలా ప్రయాణంలో ఉండేవారి నుంచి ఆ ఆకాంక్ష వస్తోందని, సాధ్యమైనన్ని ఎక్కువసార్లు మొబైల్ లో చదివే అనుభవాన్ని అప్లికేషన్సు అందుబాటులోకి వస్తున్నాయని వన్ ఇండియా సిఇవో బి.జి.మహేష్ అన్నారు.
ఎయిర్ టెల్, వొడా ఫోన్ లైవ్, ఐడియా ప్రెష్ వంటి జిపిఆర్ఎస్ కనెక్షన్లు ఈ అప్లికేషన్ ను సపోర్టు చేస్తాయి. వన్ ఇండియా కంటెంట్ ను చదవడానికి మీరు http://oneindia.newshunt.com నుంచి అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. యూజర్ డాటా డవున్ లోడ్ ఖర్చు మాత్రమే భరించాల్సి ఉంటుంది. అప్లికేషన్, కంటెంట్ ఉచితం.
ఇటీవలి కాలంలో భారతదేశంలో ఆన్ లైన్ న్యూస్ సైట్స్ రికార్డు స్థాయిలో వృద్ధిని సాధించినట్లు ఓ నివేదిక తెలిపింది. 2009 అక్టోబర్ నాటికి దాదాపు 15.8 మిలియన్ల ప్రజలు భారతదేశంలో ఆన్ లైన్ న్యూస్ సైట్స్ విజిటర్స్ గా మారారు. 2008 అక్టోబర్ నుంచి అది 37 శాతం వృద్ధిని సూచిస్తోంది.
ఎటర్నో ఇన్నోటెక్ సహకారంతో న్యూస్ హంట్ ను అభివృద్ధి పరచటం జరిగింది. వేలాది హ్యాండ్ సెట్లను సపోర్టు చేస్తూ ప్రజాదరణ పొందిన అప్లికేషన్ ఫ్లాట్ పారాలు అయిన నోకియా ఎన్60, ఎన్40, ఎన్97 వంటి నోకియా టచ్ -స్ర్కీన్ వంటి పరికరాల ద్వారా వార్తాపత్రికలను చూసే వెసులుబాటు కల్పించే పద్ధతులను రూపొందించటంలో ఆ కంపెనీ ప్రత్యేకతను సాధించింది. అంతేకాకుండా ఎటర్నో తమ పాపులర్ అప్లికేషన్సు న్యూస్ హంట్ ఐఫోన్, ఆండ్రాయిడ్, బ్లాక్ బెర్రీ యూజర్సుకూ కూడా అందుబాటులో ఉంటుందని ఇటీవల ప్రకటించింది.
వన్ ఇండియా డాట్ ఇన్ గురించి..
నెట్ కోర్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ కు చెందిన వన్ ఇండియా డాట్ ఇన్ ఇండియన్ ఇంటర్నెట్ పోర్టల్ రంగంలో అత్యంత ప్రధానమైంది. ఆంగ్లంలో, ప్రాతీయ భాషల్లో భారత వినియోగదారులకు కంటెంట్ ను, కమ్యూనిటీ, కామర్సు విషయాలను అందిస్తోంది. 2006లో ప్రారంభమైన ఇది దేశీయ, ఎన్నారై కమ్యూనిటీలో విశేష ఆదరణ పొందింది. కామ్ స్కోరు నివేదికను బట్టి నెంబర్ వన్ స్వతంత్ర భారతీయ భాషా పోర్టల్.
మరింత సమాచారం కోసం సంప్రదించండి.
Aakriti Bhargava
PR consultant - Netcore
[email protected]
+ 91 9871220114
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications