స్ఫూర్తినిచ్చే మారుతి విజయగాధ పుస్తకంగా...

RC Bhargava
లక్ష్యాలు ఎంతో ఎత్తుగా, సాధించడానికి వీలు లేనివిగా చాలా మందికి అనిపిస్తాయి. కానీ ఎంత పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటామో అంత పెద్ద విజయాలు సాధించగలమనడానికి మంసి ఉదాహరణ మారుతీ కారు కథ. భాగస్వామిని కనుగొనడానికి, లీగల్ డాక్యుమెంట్లను పూర్తి చేయడానికి, ఫ్యాక్టరీ కట్టడానికి, సేల్స్ అండ్ సర్వీస్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకోడానికి, తక్కువ ధరతో ప్రజాకారును తయారుచేయడానికి రెండేళ్ళకు పైనే పట్టింది. అప్పటికి కార్ల రంగంలో భారతీయ నైపుణ్యం తక్కువ. ఏడాదికి లక్ష కార్లను తయారు చేసి అమ్మాలి. ప్రభుత్వ రంగ సంస్ధగా ఇదంతా చేయడానికి కఠినమైన ప్రభుత్వ నియమనిబంధనలు పాటించాలి. ప్రభుత్వాధినేతలను, సుజికి మోటార్ కార్పొరేషన్ ను సంతృప్తి పరచాలి.

అయినా మారుతీ ప్రాజెక్టు అనూహ్యంగా విజయం సాధించింది. అదీ ప్రజాకారు భావన తెలియని 1983లో. ఈ కారు రాకతో కార్ల పరిశ్రమలో విప్లవం వచ్చింది. భారదేశాన్ని చక్రాలపై నిలబెట్టింది. నమ్మదగిన, ఇంధన సామర్ధ్యం గల ఆధునిక కారును సొంతం చేసుకోగలమని సామాన్య మధ్య తరగతి పురుషులు, మహిళలు అనుకోగలిగారు. కారు సొంతం చేసుకుని అతి తక్కువ ఖర్చుతో నిర్వహించుకోగలమన్న విశ్వాసం వారిలో కలిగించింది మారుతి. దానితో సమున్నతమైన సేల్స్ టార్గెట్లను కంపెనీ సాధించగలిగింది. 26 ఏళ్ళ సుదీర్ఘ పయనం తర్వాత దేశంలో ప్రభుత్వ కంట్రోల్స్ ఎత్తేసిన నేపధ్యంలో ప్రపంచంలోని పెద్ద కార్ల తయారీదారులు ఎందరో వచ్చినా ఇప్పటికీ మారుతిదే పైచేయి.

అంతేకాదు మారుతి కార్లను అన్ని ఖండాల్లో చూడవచ్చు. ఏ విధంగా చూసుకున్నా ఇదొక నమ్మశక్యం కాని విజయగాధ. అత్యున్నత సాహసం, యాజమాన్య నైపుణ్యం, ఆంత్రపెనార్ షిప్ కు నిలువెత్తు నిదర్శనం. అప్పటి మారుతి సుజుకి కంపెనీ అధినేత, ఇప్పటి చైర్మన్ ఆర్ సి భార్గవ,సీనియర్ జర్నలిస్టు సీతతో కలిసి రాస్తున్న అద్భుతమైన విజయగాధా గ్రంధమిది. ఏ రంగాలోనైనా విజయాలను ఎలా సాధించవచ్చో తెలియజేసి, జాతిని మరింత ముందుకు తీసుకెళ్ళగలిగిన ఈ పుస్తకం త్వరలో మార్కెట్ లోకి విడుదల కానుంది. ముందే బుక్ చేసుకుంటే 30 శాతం డిస్కౌంట్ ఉంటుంది.

Pre-order Now at a Special Price. - The Maruti Story by R C. Bhargava @ 30% discount

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+