వ్యక్తిని కాల్చి చంపిన టీవీ9?

TV9 Journalist
రేటింగ్ పై దుగ్ధతో టీవీ9 గుజరాత్ చానెల్ జర్నలిస్టులు ఇద్దరు ఓ మనిషిని కాల్చి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ సంఘటన ఆలస్యంగా తెలుగు సమాజానికి తెలిసింది. టీవీ9 తెలుగు టీవీ చానెల్ మిగతా భాషల్లో కూడా చానెళ్లను నడిపిస్తోంది. ఆ ఇద్దరు జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని గత నెలలో ఇండియా గ్రూప్ నకు చెందిన టాబ్లాయిడ్ మెయిల్ టుడే పత్రిక వెలుగులోకి తెచ్చింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో టీవీ9 గుజరాత్ చానెల్ జర్నలిస్టులు ఓ వ్యక్తిని తమకు కెమెరాలకు చిక్కే విధంగా పోలీసు స్టేషన్ ముందు సజీవ దహనానికి పురికొల్పారనే ఆరోపణలు వచ్చాయి.

ఆస్తి తగాదాపై పోలీసుల నిర్లక్ష్యానికి నిరసనగా ఒంటికి నిప్పంటించుకోవాలని కల్పేష్ మిస్త్రీని టీవీ9 జర్నలిస్టులు మయూర్ రావల్, కమలేష్ రావల్ ప్రోత్సహించారని పోలీసులు ఆరోపించారు. వారికి జిటిపిఎల్ అనే స్థానిక కేబుల్ కంపెనీ కూడా ఉంది. ఒంటికి నిప్పంటించుకోవడంతో 29 ఏళ్ల కల్పేష్ మిస్త్రీ 90 శాతం గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ అతను మరణించాడు. మంటలను ఆర్పడానికి బదులు ఆ ఇద్దరు వ్యక్తులు ఆ దృశ్యాన్ని చిత్రీకరించడంలో మునిగిపోయారు. దాని గురించి భయపడవద్దని, ఇదంతా డ్రామా అని చెప్పినట్లు ఆ వ్యక్తి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే, పోలీసులు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారంటూ జర్నలిస్టులు ఆందోళనలకు కూడా దిగారు.

అకస్మాత్తుగా ఈ వార్తాకథనం తెలుగు టీవీ చానెళ్లకు ముడి సరుకుగా మారింది. తెలంగాణకు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్న టీవీ9పై తెలంగాణ గుండె చప్పుడు రాజ్ న్యూస్ తీవ్రంగా మండిపడుతోంది. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే విషయంపై పరిశీలన జరుపుతున్నామని శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ చెప్పినట్లు టివీ9 ప్రసారం చేసిన వార్త కూడా వివాదమైంది. ఆ వార్తపై రాజ్ న్యూస్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఇప్పుడు తాజా టీవీ9 గుజరాత్ టీవీ చానెల్ జర్నలిస్టుల ఉదంతానికి వెలికి తీసింది. టీఆర్పీ రేటింగ్ కోసం తాపత్రయపడిన టీవీ చానెల్ ఓ మనిషి ప్రాణం తీసిందని రాజ్ న్యూస్ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+