సెక్స్ స్కామ్: నిత్య గోపిక

Nityananda Swami
బెంగళూరు: స్వామి నిత్యానంద లైంగిక కుంభకోణంలో మరో పాత్ర వెలుగు చూసింది. ఆ పాత్ర పేరు నిత్య గోపిక. స్వామి నిత్యానంద సన్నిహిత సహచరి నిత్య గోపిక కోసం సిఐడి పోలీసులు అన్వేషిస్తున్నారు. తమిళ నటి రంజితతో స్వామి నిత్యానంద రాస లీలల వీడియో వెలుగు చూసినప్పటి నుంచి ఆమె కనిపించడం లేదు. ప్రతి చోటా నిత్యానంద వెంట ఆమెనే ఉండేది. అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు నిత్యానంద వ్యక్తిగత విషయాలన్నీ ఆమె చూసుకుంది. అతని వస్తువులు కూడా అమె వద్దనే ఉన్నాయి. నిత్యానంద నాన్ డిస్ల్కోజర్ క్లాజ్ లో పేర్కొన్నవారిలో ఆమె ఒక్కతె కావచ్చునని సిఐడి అధికారులు అనుమానిస్తున్నారు. రంజితతో నిత్యానంద సాన్నిహిత్యం పెరిగిన తర్వాత నిత్య గోపిక అభద్రతా భావానికి గురైందని, దాంతో ఆమె రాసలీలలను వీడియో తీయడానికి ప్రోత్సహించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. నిత్యానంద కార్యకలాపాలను బయట పెట్టడానికి ఆమె డ్రైవర్ కురుప్పన్ లెనిన్ వాడుకుని ఉంటుందని కూడా అనుకుంటున్నారు. నిత్య గోపిక అమెరికా ప్రవాస భారతీయులు కావచ్చునని, అమె అమెరికాలో డాక్టరేట్ చేసిందని భావిస్తున్నారు. ఆశ్రమానికి వచ్చి నిత్యానందతో స్వామితో సాన్నిహిత్యం పెరిగిన తర్వాత భర్తకు విడాకులు ఇచ్చిందని అంటున్నారు.

కాగా, తనకు మగతనం లేదని నిత్యానంద చెప్పిన మాటలను సిఐడి పోలీసులు విశ్వసించడం లేదని తెలుస్తోంది. తాను పురుషుడిని కానని, అందువల్ల లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం లేదని నిత్యానంద చెప్పాడు. కేసును తప్పుదోవ పట్టించడానికే అతను అలా చెబుతున్నాడని అనుకుంటున్నారు. నిత్యానంద పాస్ పోర్టులో ఆయన పురుషుడని ఉంది. హైదరాబాద్ నుంచి ఫోరెన్సిక్ లాబొరేటరీ నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. పోలీసుల వద్ద మొత్తం 36 వీడియో క్లిప్పులు ఉన్నాయి. వాటిలో ఐదుగురు మహిళలతో అతను సన్నిహితంగా ఉన్నట్లు తెలుపుతున్నాయి. ఆ సిడిని పోలీసులు విశ్లేషణ కోసం హైదరాబాద్ పంపారు. శుక్రవారం ఆ నివేదిక అందే అవకాశం ఉంది.

భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు నిత్యానంద వద్ద ఏయే వస్తువులున్నాయనే విషయాన్ని తెలియజేయాలని రెవెన్యూ ఇంటలిజెన్స్ డైరెక్టరేట్ అన్ని విమానాశ్రయాలకు ఆదేశాలు జారీ చేసింది. అమెరికాకు బంగారంతో చేసిన కమండలాలు, స్లిప్పర్లు తీసికెళ్లాడని డైరెక్టరేట్ పరిశోధనల్లో వెల్లడైంది. కాగా, నిత్యానందతో తాను రాసలీలలు జరిపినట్లు ప్రసారమైన వీడియోలు నిజానివి కావని రంజిత అంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+