వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరీ సునంద పుష్కర్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Shashi Tharoor
విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి శశి థరూర్ మంత్రి పదవి ఊడడానికి కారణమైన సునంద పుష్కర్ ఎవరనే విషయం ఆసక్తికరంగా మారింది. కొచ్చి ఐపియల్ ఫ్రాంచైజీలో శశి థరూర్ 70 కోట్ల రూపాయల ఉచిత వాటా ఇప్పించేంతగా థరూర్ ఒత్తిడి తేవడంపై ఆశ్చర్యం కూడా వేస్తోంది. మొత్తం మీద, సునంద పుష్కర్ ఐపియల్ డొంకనంతా కదిలించింది. ఐపియల్ చైర్మన్ లలిత్ మోడీ వ్యవహారం కూడా దీంతో విచారణకు వచ్చింది. ఆయన పదవి కూడా ఊడిపోయే పరిస్థితి వచ్చింది.

శశి థరూర్ స్నేహితారులై సునంద పుష్కర్ ఇటీవ వివిధ సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ వచ్చింది. తాను కెనడాకు చెందిన థరూర్ స్నేహితురాలినంటూ పరిచయం చేసుకుంటూ వచ్చింది. దీన్ని థరూర్ కూడా ఖండించలేదు. దానికి తోడు, సునంద పుష్కర్ ను థరూర్ పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. దాదాపు నలబై ఏళ్ల వయస్సు ఉన్న సునంద దుబాయ్ లో స్పా నడుపుతుంది. ఎమిరేట్స్ ప్రభుత్వం నడుపుతున్న మౌలిక సదుపాయాల సంస్థలో ఎగ్జిక్యూటివ్ పదవిలో ఉంది. టొరంటోలోని ఐటి సంస్థలోనే కాకుండా దుబాయ్ లోని అడ్వర్టయిజింగ్ సంస్థల్లో, ట్రావెల్ ఏజెన్సీల్లో పనిచేసింది.

సునంద కాశ్మీర్ కు చెందిన మహిళ. ఆయన తండ్రి రిటైర్డ్ కలొనెల్. కొచ్చి ఫ్రాంచైజీని పొందిన రాండివూ సంస్థ సునంద పుష్కర్ ను సేల్స్, మార్కెటింగ్ నిపుణురాలని చెప్పింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X