వయసు మళ్ళినా చెల్లుబాటులో బాలీవుడ్ నటన!

Abhishek Bachchan-Shahrukh Khan
షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అజయ్ దేవగన్. పేరు పడ్డ ఈ బాలీవుడ్ నటులందరూ 1990లలో అప్పటి బాలీవుడ్ రంగాన్ని ఒక ఊపు ఊపేశారు. ఆ నాటి నుండి ఈనాటికి రెండు దశాబ్దాలు పైగా అయిపోయింది. అయినప్పటికి వీరే ఇంకా ప్రధానంగా కొనసాగిపోతున్నారు.

అభిషేక్ బచ్చన్, హృతిక్ రోషన్, ఇంకా తక్కువ వయసంటే, షాహిద్ కపూర్, రణ్బీర్ కపూర్, ఇమ్రాన్ ఖాన్, అభయ్ డియోల్ , ఎమ్రాన్ హాష్మీ లాంటి కిక్కెచ్చే యువ నటులున్నప్పటికి, బాక్సాఫీస్ సక్సెస్ మాత్రం ఫార్టీ ప్లస్ నే అధికంగా వరిస్తోంది.

అరవై ఎనిమిదేళ్ళ అమితాబ్, రంగంలో నాలుగు దశాబ్దాల పైగా నటిస్తున్నప్పటికి, ప్రాధాన్యతలో వెనుక బడే సూచనలే లేవు. ఇంకా ప్రధాన పాత్రల్లో నటిస్తూనే వున్నాడు. 'బుఢ్డా హోగా తేరా బాప్" తర్వాత 'అరక్షణ్" లో కూడా ప్రేక్షకులను కట్టి పడేస్తున్నాడు. ఏ మాత్రం వెనక పడలేదంటానికి అయిదో సారి తీస్తున్న 'కౌన్ బనేగా కరోడ్ పతి" యే నిదర్శనం.

బిగ్ బి ని వదిలేస్తే, స్క్రిప్టు, బడ్జెట్ లు సరిపోయాయంటే నిర్మాతలు అనిల్ కపూర్, సంజయ్ దత్, సల్మాన్, షారుఖ్, అమీర్, అజయ్, సైఫ్ అలీ ఖాన్ అక్షయ్ కుమార్ లాంటి టాప్ స్టార్ లతోనే సరిపెట్టేసుకుంటున్నారు.

గత సంవత్సర ధభాంగ్ విజయంతో సల్మాన్ ఇంకా బాగానే అమ్మకానికి పనికి వస్తాడని తేలింది. 2011 లో 'రెడీ "ని మెప్పించాడు. హెయిర్ లైన్ కాస్త వెనుకపడుతున్నా విజయానికి కొదవ లేదు. ఇపుడు 'బాడీ గార్డ్ "బాక్స్ ఆఫీస్ కు బంగారం పలికించనుంది. 45 ఏళ్ళ షారుఖ్ మొహంలో కొద్ది పాటి ముడతలు కనపడుతున్నా త్వరలో 'రా.వన్", 'డాన్ 2" , 'ది ఛేస్ కంటిన్యూస్" లకు సిద్ధం అవుతున్నాడు. 46 ఏళ్ళ అమీర్ ఖాన్, తన కాలేజ్ బాయ్ లుక్స్ కోల్పోయినప్పటికి ప్రేక్షకుల క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. 2009 ' త్రీ ఇడియట్స్", 2010' పీప్లీ లైవ్ "లేదా ఇటీవలి రిలీజ్ ' ఢిల్లీ బెల్లీ "లు అమీర్ ప్రేక్షకులకు అన్ని కాలాలకి పనికి వస్తాడన్నట్లు చెపుతున్నాయి. ఈ నటులు రొమాన్స్ నుండి హాస్యం వరకు ఏది కావాలంటే అది ప్రేక్షకులకు అందిచేస్తున్నారు.

51 ఏళ్లు పైబడ్డ అనిల్, సంజయ్ లు కూడా ప్రేక్షకులను అలరిస్తూనే వున్నారు. సంజయ్ 'డబుల్ ధమాల్ "లో సక్సెస్ కాగా, అనిల్ 'మిషన్ ఇంపాజిబుల్", 'ఘోస్ట్ ప్రొటోకోల్" లతో ఆడియన్స్కు విందు చేయనున్నాడు.

ఇదంతా చూస్తే, బాలీవుడ్ లో ఈ నటులకు వయస్సులతో పని లేదని చెప్పుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+