ఆరక్షణ్‌కు అంత సీన్ లేదా?

భారతదేశంలోని అత్యుత్తమ కళాశాలకు ప్రిన్సిపాల్ అయిన డాక్టర్ ప్రభాకర్ ఆనంద్ (అమితాబ్ బచ్చన్) కథ ఇది. వైస్ ప్రిన్సిపాల్ మథిలేష్ సింగ్ (మనోజ్ బాజ్‌పేయి) విద్యను సరుకుగా భావించి వ్యాపారపరం చేయాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. దానికి వ్యతిరేకంగా ప్రభాకర్ ఆనంద్ చేసే పోరాటంలో ఓ దళిత విద్యార్థి దీపక్ కుమార్ (సైఫ్ అలీఖాన్), అగ్రవర్ణ విద్యార్థి సుశాంత్ సేథ్ (ప్రతీక్ బబ్బర్) మధ్య ప్రభాకర్ ఆనంద్ ఇరుక్కుపోతాడు. ఈ సమయంలో అతను డైలమాలో పడుతాడు. బహుశా ఈ సంఘర్షణలోనే దర్శకుడు ప్రకాశ్ ఝా హమ్ మెరిట్ మే విశ్వాస్ రఖ్‌తే హై, ఆరక్షణ్ మే నహీఁ అనే డైలాగ్‌ను అమితాబ్ బచ్చన్‌తో చెప్పించి ఉంటాడు.
సినిమా వాణిజ్య ప్రకటనల్లో చూపిన కొన్ని ట్రైలర్స్ మొత్తం వివాదానికి కారణమైనట్లు భావిస్తున్నారు. భారత సమాజంలోని అత్యంత వివాదాస్పదమైన రిజర్వేషన్ల అంశాన్ని ప్రకాష్ ఝా డీల్ చేసినట్లు వివాదం వల్ల అనిపిస్తోంది. కానీ, ఆయన దాన్ని ఎక్కడ ప్రారంభించాడో అక్కడే వదిలేసినట్లు రివ్యూలను బట్టి తెలుస్తోంది. సమస్యను ఎత్తిచూపిన ప్రకాష్ ఝా దానికి పరిష్కారం చూపే విషయాన్ని వదిలేశాడు. మొత్తం విద్యావ్యాపారంపైనే దృష్టి కేంద్రీకరించాడు.












Click it and Unblock the Notifications