రీల్ హీరోనే కాదు, రియల్ హీరో కూడా..

అని పేరు జగ్గేష్. కన్నడ సినిమా హీరో మరియు పొలిటీషన్. ఇటీవల బెంగుళూరు మల్లేశ్వరం 18వ క్రాస్ లోని జగ్గేష్ ఇంటి వద్ద ఓ సంఘటన చోటు చేసకుంది. ఆయన ఫోన్ మాట్లాడుతూ ఇంటి బయట నిల్చోగా ఓ ఇద్దరు చైన్ స్నాచర్స్ ఓ మహిళ మెడలోని గోల్డ్ చైన్ ను తస్కరించి బైక్ పై పరారయ్యారు. సదరు మహిళ అరుపులు మొదలు పెట్టడంతో వెంటనే స్పందించిన జగ్గేష్ వారిని చేస్ చేసి పట్టుకున్నాడు. ఆ ఇద్దరు చైన్ స్నాచర్స్ కాలేజీ కుర్రోళ్లే కావడం గమనార్హం. ఈ విషయమై వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఆ ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. జగ్గేష్ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో(ఫిబ్రవరి 9, 2010న) రైల్వే ట్రాక్ పై ప్రమాదవశాత్తు పడి గాయపడిన ఓ వ్యక్తిని కాపాడి స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లాడు.












Click it and Unblock the Notifications