సినిమా ఆయుధంతో...యాంటీ కరప్షప్ హీరోలు

దేశంలో ఇప్పటి వరకు అవినీతికి వ్యతిరేకంగా, సమాజ హితం కోరుతూ... అదే సమయంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన మంచి సినిమాలు తీసిన ప్రముఖుల విషయానికొస్తే...మనం ముందుగా చెప్పుకోవాల్సింది ప్రముఖ డైరెక్టర్ శంకర్ గురించే. ఆయన దర్శకత్వంలో వచ్చిన జంటిల్ మెన్, ఒకేఒక్కడు, భారతీయుడు, శివాజీ, అపరిచితుడు లాంటి సినిమాలు అవినీతిపై సమరశంకం పూరించాయి. జంటిల్ మెన్ సినిమాలో పేద విద్యార్థులు డొనేషన్లు కట్టలేక పడుతున్న ఇబ్బందులు కళ్లకు కట్టినట్లు చూపిస్తే, భారతీయుడు సినిమా ద్వారా దేశంలో పాతుకు పోయిన లంచగొండి తనాన్ని ఎండట్టారు. అపరి చితుడు సినిమా అవినీతిని ఎత్తి చూపడమే కాదు..కఠిన శిక్షలు అమలు చేస్తే తప్పు చేయడానికి భయపడతారు అనే సందేశాన్ని ఇచ్చాడు.
ఇలాంటి మంచి విషయాలను త్వరగా ప్రజల్లోకి తీసుకుని పోయి వారిలో చైతన్యం, సమాజంలో మార్పు తేవాలంటే....భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నకథాయినాయకులు అయితే బెస్ట్. అందుకే దర్శకులు మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్, విక్రమ్ లాంటి హీరోలతో యాంటీ కరప్షన్ సినిమాలు తీస్తుంటారు. ఠాగూర్, భారతీయుడు, మల్లన్న లాంటి సినిమాలు ఆ కోవలోకి చెందినవే. దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి లాంటి సమస్యలపై.....సినిమా అనే సాధనాన్ని ఆయుధంగా చేసిన యుద్దం చేస్తున్న వీరంతా, రియల్ హీరోలు అని చెప్పక తప్పదు. మరి ఇలాంటి సినిమాలు భవిష్యత్‌లో మరెన్నో రావాలని ఆకాంక్షిస్తూ యాంటీ కరప్షన్ హీరోలకు జై కొడదాం.












Click it and Unblock the Notifications