అనుష్కకి భయం మొదలైంది

Anushka
వయస్సు ముందుకు వెళ్ళి, ముదురుతూంటే హీరోయిన్స్ కి ఎక్కడలేని భయాలు మొదలవుతోంది.అయితే అనుష్క కి ఇప్పుడు వయస్సు భయం కన్నా కెరీర్ భయం పట్టుకుంది.ఆమెకు అరుంధతి నాటి నుంచి వేదం వరకూ వరసగా హీరోయిన్ ఓరియెంటెడ్ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి.అయితే కొన్ని ఓకే చేస్తూ,మరికొన్ని రిజెక్ట్ చేస్తూ వస్తోంది.అందుకే దాసరి నారాయణరావు ఆఫర్ ని కూడా ఆమె కాదనుకుంది.

అయితే అనుష్క మంచి ఆఫర్ ని కాలుదన్నుకోందని ఇప్పుడు తమిళ నాట వినిపిస్తోంది.ఏమిటా ఆఫర్ అంటే ప్రముఖ దర్శకుడు బాలా నుంచి ఆమెకు సినిమా ఆఫర్ వచ్చింది.అరుంధతి స్థాయిలో ఓ లేడీ ఓరియెంటెడ్‌ సబ్జెక్ట్‌తో తమిళ దర్శకుడు బాల సిద్ధమవుతున్నాడు. అందులో అనుష్కను తీసుకోవాలనుకుంటున్నాడు. 'వాడు-వీడు' సినిమాకు ముందే ఈ సబ్జెక్ట్‌ బాల తయారు చేసుకున్నాడు. ఇందులోని ప్రధాన పాత్ర కోసం అనుష్కను సంప్రదించాడు. కానీ అనుష్క నుంచి ఇప్పటిదాకా దర్శకుడు బాలకు ఎలాంటి స్పందన రాలేదు.దాంతో మరోసారి అడిగి వేరేవారిని ఫైనలైజ్ చేసే ఆలోచనలో బాలా ఉన్నారు.

డి-గ్లామరరైజ్డ్‌ సబ్జెక్ట్‌తో ఆయన సినిమాలు తీస్తారని, అందుకే అనుష్క వెనకడుగు వేస్తోందని చెప్తున్నారు. అయితే ఆయనకున్న ట్రాక్‌ రికార్డ్‌, సత్తాను దృష్టిలో పెట్టుకొని అనుష్క గ్రీన్‌ సిగల్‌ ఇద్దామనే ఆలోచనలో పడిందని ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.అందులోనూ ఆమెకు ఈ మధ్య హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలంటే భయం పట్టుకుంది.అలా సినిమాలు చేసిన వారంతా ఆ తర్వాత హీరోల ప్రక్కన ఛాన్స్ లు రాక అటు ఆ సినిమాలు హిట్టు కాక ఇబ్బందిపడటం గమనించిన ఆమె బాలా అయినా కష్టం అంటోంది.మరో ప్రక్క ఆమె రంపచోడవరం అనే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం కూడా ఒప్పుకుంది.అన్నీ అలాంటి సినిమాలే అవుతాయని భయపడుతోంది.ఇక ప్రస్తుతం ఆమె నాగార్జున సరసన ఢమురకం చిత్రం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+