మారువేషాల్లో తిరుగుతున్న భానుకిరణ్

అయితే తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండటానికి మారు వేషాలు వేసుకుంటున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఓసారి విగ్గు పెట్టుకోవడం, మరోసారు గుండు గీసుకోవడం, సూట్ వేసుకోవడం, మీసాలు తీసేస్తూ.. ఒక్కో సమయంలో ఒక్కో మతానికి చెందిన వ్యక్తిగా గెటప్‌లు మార్చుతున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భాను కిరణ్ ఆచూకీ కోసం పోలీసులు దేశంలోని తొమ్మిది ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ స్థానికులు చెప్పిన ప్రకారం ఊహా చిత్రాలు గీసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఒక ఊహా చిత్రకారుడిని సైతం తన వెంటే ఉంచుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు రోజుకో అవతారం ఎత్తి తమను బురిడీ కొట్టిస్తున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా నిర్మాతలు శింగనమల రమేష్, సి. కళ్యాణ్ ఇచ్చిన సమాచారం మేరకు సైతం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications