వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్ద హీరోలు ఫ్లాప్, నష్టాల్లో ఇండస్ట్రీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Jr Ntr-Pawan Kalyan
అదరగొడతారని భావించి హంగామాతో వచ్చిన పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. దీంతో టాలీవుడ్ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. ఈ ఏడాది మొదటి అర్థభాగంలో తెలుగు సినిమా పరిశ్రమకు 200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ఓ అంచనా. భారీ అంచనాలతో, భారీ ప్రచారంతో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ తదితర హీరోల సినిమాలు ఏ మాత్రం లాభాలను సాధించిపెట్టలేకపోయాయి. అలా మొదలైంది వంటి చిన్న బడ్జెట్ చిత్రం విజయం సాధించింది. రవితేజ నటించిన మిరపకాయ్ పోటీ లేకపోవడంతో లాభాలు సాధించి పెట్టింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 54 చిత్రాలు విడుదల కాగా, ఎనిమిది తొమ్మిది చిత్రాలు మాత్రమే ఫలితం సాధించాయి.

ఐదు కోట్లు లేదా అంతకు కొద్దిగా ఎక్కువ మొత్తం పెట్టుబడితో నిర్మించిన అలా మొదలైంది, అహ నా పెళ్లంట, సీమ టపాకాయ, ప్రేమ కావాలి, మిస్టర్ ఫర్‌ఫెక్టు చిత్రాలు నిర్మాతలకు, చిత్ర ప్రదర్శకులకు ఊరటనిచ్చాయి. ముప్పై కోట్లకు పైగా పెట్టుబడితో నిర్మించిన చిత్రాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక నష్టాలు తెచ్చి పెట్టాయి. నిరుడు బారీ అంచనాలతో విడుదలైన మహేష్ బాబు ఖలేజా, పవన్ కళ్యాణ్ కొమరం పులి బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. దాంతో ఈ ట్రెండ్ ప్రారంభమైందని చెప్పవచ్చు. అల్లు అర్జున్ బద్రీనాథ్ మిశ్ర మ ఫలితం సాధించింది. అయితే, భారీ బడ్జెట్ వల్ల ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. భారీ అంచనాలతో ఏప్రిల్‌లో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ శక్తి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

పవన్ కళ్యాణ్ తీన్ మార్, రామ్ చరణ్ తేజ ఆరెంజ్ నిర్మాతల పాలిటి శాపంగా మారాయి. 30 కోట్ల నుంచి 40 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టే నిర్మాతలు తమ సినిమాలను పంపిణీదారులకు విక్రయిస్తారు. నిర్మాతలు, పంపిణీదారులు, చిత్ర ప్రదర్శకులు నష్టాల బారిన పడుతున్నారు. అయితే, వీరిలో ఎవరెవరు ఏ మేరకు నష్టపోతారనేది వారు చేసుకునే ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రాలు ఫెయిల్ కావడానికి కారణాలు పరిశ్రమలోనే ఉన్నాయి. నష్టాలపై, దాని నుంచి బయటపడాల్సిన అవసరంపై నిర్మాతల మండలిలో ఇటీవల చర్చ జరిగింది.

English summary
Tollywood is in doldrums. The losses of industry is estimated about RS 200 crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X