నిధి నిక్షేపాల కోసం కామవరపుకోట బావిలో వేట

వారు పాలించిన కాలంలో అక్కడి శివాలయంలో భారీగా నిధులు భద్రపరిచినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. కోట చుట్టూ కూడా అపార నిధులు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట ప్రాంగణంలోని పొలాల్లోనూ భారీగానే నిధులు ఉండవచ్చని భావిస్తున్నారు. గతంలో పలుమార్లు పొలాల్లో నిధులు దొరికిన సందర్భాలు ఉన్నాయంట. ఓసారి కోట ప్రాంతంలోని ఓ పొలాన్ని ఓ రైతు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాడు. సదరు కౌలు రైతుకు ఆ పొలంలో లంకె బిందెలు దొరికాయని, వాటిని ఆ రైతు తీసుకున్న రెండేళ్లలో ఆ కుటుంబంలోని ఆరుగురు మరణించారనేది గ్రామస్తుల వాదన. అంతేకాదు మరో రైతు కుటుంబానికి ఇలాంటి ఘటనే ఎదురయిందంట.
అయితే తమ తమ పొలాల్లో నిధులు ఉన్నాయని చెప్పేందుకు ఎవరు కూడా ముందుకు రావడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. కోట ప్రాంతంలోని దేవాలయంలో ఎల్ ఆకారంలో ఓ బావి ఉంది. ఆ బావిలో కూడా అపార నిధి నిక్షేపాలు ఉన్నాయని తెలుస్తోంది. నిధులలో రాజనిధి, దైవ నిధి, స్వార్థ నిధి మూడు రకాలుగా ఉంటుందని అందులో దైవ నిధిని ఎవరూ ముట్టకూడదని ముడితే అరిష్టమని అక్కడి వారు అభిప్రాయపడుతున్నారు. ఆర్కియాలజిస్టులు గుడిలో, బావిలో పరిశోధనలు చేయాలని పలువురు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications