తరుచుగా నిద్ర చెడితే జ్ఞాపక శక్తి గోవిందా!

మొదటగా వీరు తమ అధ్యయనాన్ని లేబరేటరీలో ఎలుకల మీద చేశారు. తరచుగా నిద్ర చెడిన ఎలుకలు లేచిన వెంటనే తాము పరిచయంగా చూసే వస్తువులను గుర్తించటం లో విఫలమయ్యాయట. ముందుగా వీరు నిద్ర పట్టటానికి, నిద్ర లేవటానికి కారణమైన బ్రెయిన్ సెల్స్ గుర్తించారు. నిద్రిస్తున్న ఎలుకల బ్రెయిన్ సెల్స్ లోకి వెలుగును పంపి నిద్రను పాక్షికంగా చెడగొట్టి తమ రీసెర్చిని కొనసాగించారు. సాధారణంగా ఎలుకలు కొత్త వస్తువును అధిక సమయం పరిశీలిస్తాయి. పాత వస్తువైతే చూసి పక్కకు తప్పుకుంటాయట.
కలత నిద్ర నుండి లేచిన ఎలుకలు తమ మెమొరీ పవర్ కోల్పోయి పాత వస్తువలను సైతం కొత్త వస్తువులలానే పరిశీలించటం మొదలెట్టాయట. కనుక తరచుగా నిద్రా భంగం కావటమనేది భవిష్యత్తులో అనేక తీవ్ర సమస్యలకు దారి తీయగలదని, ఇటువంటి వారు వెంటనే డాక్టర్ ను సంప్రదించటం మంచిదని అధ్యయనకారులు తేల్చేశారు.












Click it and Unblock the Notifications