హల్లో.... పిల్లలకు సెల్ ఫోన్ సురక్షితమే!

అయితే, మొదటి దశగా, నిరంతరం ఎదుగుదల చెందే పిల్లల బ్రెయిన్లపై రీసెర్చి చేస్తున్నారు. 2004 - 2008 సంవత్సరాల మధ్య 7 నుండి 19 ఏళ్ళు పిల్లలపై నార్వే, డెన్మార్క్, స్వీడన్, స్విట్జర్లాండ్ లలో బ్రెయిన్ కేన్సర్ గల 352 మంది పిల్లలపై పరిశోధన చేశారు. వీరిని మరో 646 మంది ఆరోగ్యవంతులైన పిల్లలతోను, టీన్స్ తోను పోల్చారు. రెండు గ్రూపుల్లోను సగం మంది సెల్ ఫోన్ వాడతారని నేషనల్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ జర్నల్ లో తెలిపారు.
అయిదేళ్ళ నుండి నిరంతరం సెల్ ఫోన్ వాడుతున్నప్పటికి వారి బ్రెయిన్ లకు సెల్ ఫోన్ ఎపుడో ఒక సారి వాడే పిల్లల బ్రెయిన్ లకు మధ్య వ్యత్యాసమేమీ లేదని తేలింది. అధ్యయన కారులు కాల్ ల సంఖ్య, ఏ చెవికి ఫోన్ పెట్టి మాట్లాడుతారు మొదలైనవి కూడా పరిశీలించారు. సెల్ ఫోన్ వాడకం వలన బాల్యంలో అప్పటికే బ్రెయిన్ కేన్సర్ గల వారికి అది ఏ మాత్రం పెరగలేదని స్విస్ ట్రోపికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూట్ రీసెర్చెర్స్ కూడా తెలిపారు. కేన్సర్ వచ్చే అవకాశం ఉన్న వారు ఫోన్ ను తలకు వీలైనంత దూరంగా పెట్టి మాట్లాడ వచ్చని కూడా కేన్సర్ సొసైటీ తెలుపుతోంది.












Click it and Unblock the Notifications