సన్నబడాలనుకుంటున్నారా? నమలండి నలభై సార్లు!

నోటి నిండా పెట్టుకున్న ఆహారాన్ని కావాలని నలభై సార్లు నమిలిన వ్యక్తులు, 15 సార్లు నమిలిన వారి కంటే 12 శాతం తక్కువ ఆహారాన్ని తీసుకున్నారట. అధిక సమయం నములుతూ వుంటే, పొట్ట నిండుగా వున్నదన్నసంకేతాలు పొట్ట నుండి బ్రెయిన్ కు అధికంగా కూడా చేరతాయట. ఫలితంగా ఆకలిని నియంత్రించే హార్మోన్ స్ధాయి కూడా తగ్గుతుందట. రీసెర్చిలో లావుగా వున్నవారు తక్కువ నములుతారని, సన్నటి వారు అధికంగా నములుతారని కూడా తేలింది.
అధికంగా నమలటం వలన నోటిలో ఊరే లాలాజలం జీర్ణక్రియలో ఒకటోవంతు భాగాన్ని నోటిలోనే నిర్వహించేస్తుంది. ఇక మిగిలిన మూడు వంతులు మాత్రమే పొట్టలోని ఇతర భాగాలలో తేలికగా జీర్ణం చేయబడతాయట. కనుక అధికంగా ఆహారం తీసుకుని లావు అయ్యే వారంతా సన్న బడాలంటే, అధిక సమయం నమలడమే పరిష్కారంగా రీసెర్చర్స్ చెపుతున్నారు.












Click it and Unblock the Notifications