మనిషికి మంచి మిత్రుడైన కుక్కను సైతం మరిపిస్తున్న కంప్యూటర్!

కుటుంబంలోని కొన్ని శిక్షణ ఇవ్వబడిన కుక్కలు ఉదయంపూట వచ్చే న్యూస్ పేపర్లను తెచ్చి తమ యజమానుల కిచ్చేవి. పాపం ఇపుడు, యజమాని వార్తలను బ్రాడ్ బేండ్ లోనే చదివేయటంతో దానికి ఆ చిన్ని సంతోషం కూడా మాయమైంది. అంతే కాదు, గతంలో వలే కాకుండా, మార్నింగ్ వాక్ లలో సైతం ల్యాప్ టాప్ లను తీసుకెళ్ళే వ్యక్తులుండటంతో కుక్కకు మనిషితోగల అనుబంధాలలో వున్న స్ధానం మరింత కిందకు పడిందనే చెప్పాలి.
అయితే, వినయ విధేయతలు కల కుక్కలకు ఏదో ఒక రకంగా కుటుంబంలో స్ధానం ఉండనే ఉంటుంది. మీ కుక్కకు దీర్ఘకాలంలో కావలసిన సమాచారంతో పాటు, కుటుంబమంతా ఏ ఏ రకాలుగా కుక్కలతో ఆనందించగలదో తెలిపే అంశాలన్నీ పిసి లలో పొందుపరచబడి వుందంటారు ఎల్లేన్. చివరకు, వెబ్ సైట్లు తమ సమాచారంతో పర్సనల్ కంప్యూటర్ ని కుక్కకు బెస్ట్ ఫ్రెండ్ గా చేసేశాయి.












Click it and Unblock the Notifications