హసన్ అలీకి హైదరాబాద్‌తో లింక్స్

హసన్ అలీ ఖాన్ హైదరాబాదులోనే పుట్టి పెరిగాడు. ఇక్కడే పెరిగాడు. అతని కెరీర్ కూడా ఇక్కడే ప్రారంభమైనట్లు చెబుతారు. హైదరాబాదులోని ముషీరాబాద్‌లో నివాసం ఉండే సుభానీ నవాబ్ ఆరుగురు కుమారుల్లో హసన్ అలీ ఒక్కడు. ట్రిక్‌స్టర్‌గా, బ్యాంక్ స్కామ్‌స్టర్‌గా, హవాలా ఆపరేటర్‌గా, అంతర్జాతీయ మనీ లాండరింగ్ రాకటీర్‌గా అతను పేరు మోశాడు. అయితే, హసన్ అలీ కార్యకలాపాలపై హైదరాబాదు నగర పోలీసులు ఎప్పుడూ దృష్టి సారించలేదని సమాచారం. అతనిపై కనీసం డజన్ కేసులు నమోదై ఉన్నాయి. వాటి దర్యాప్తుపై పోలీసులు ఎప్పుడూ దృష్టి పెట్టలేదు.
హసన్ అలీ మాజీ భార్య మహబూబ్ ఉన్నీసా అలియాస్ షాహిన్‌షా, అతని కుమారుడు సమీ ఖాన్ హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. వీరితో హసన్ అలీ సంబంధాలు కొనసాగిస్తున్నాడా, లేదా అనేది తెలియదు. హసన్ అలీ 1999లో మహబూబ్ ఉన్నీసాకు విడాకులు ఇచ్చాడు. ఖాన్ పూణేలో గుర్రాలకు శిక్షణ ఇచ్చే వ్యక్తి సోదరిని చాలా కాలం క్రితమే పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఇటీవలి కాలంలో అతను హైదరాబాదు వచ్చిన దాఖలాలు లేవని అంటున్నారు. తన కుటుంబంతో బంజారాహిల్స్‌లో ఉంటున్నప్పుడు కొందరు అధికారులు, రాజకీయ నాయకులు అతన్ని కలిసేవారని చెబుతారు.












Click it and Unblock the Notifications