రామ్ చరణ్ కి దాసరి కౌంటర్ ఎలా?

తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ ఇప్పుడు దాసరి,రామ్ చరణ్ మాత్రమే. రామ్ చరణ్ రీసెంట్ గా దాసరి కి తన ట్విట్టర్ లో దిమ్మ తిరిగిపోయేలా ఇచ్చిన కామెంట్ కి అందరూ షాక్ అయ్యారు. పిల్లాడు ...అంత పెద్దాయనతో ఎందుకు తలపడతాడు అనుకున్నవారికి ఇది ఊహించనిపరిణామమైంది. ఈ నేపధ్యంలో దాసరి నెక్స్ట్ స్టెప్ ఏమిటన్నది చర్చనీయాంశమైంది. దాసరి కూడా వెంటనే స్పందించి కౌంటర్ ఇస్తాడనుకుంటే ఆయనకు ట్విట్టర్ ఎకౌంట్ లేదాయే. ఏదన్నా పబ్లిక్ పంక్షన్ కి వెళ్ళి అక్కడ మీడియా వద్ద కామెంట్ చేయాలి.

అందుకోసమే తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నారా అనేది కొందరి డౌట్.అయితే పరిశ్రమలో టాక్ మరో విధంగా వినపడుతోంది. దాసరి క్యాంప్ నుంచి కొందరు చిరుని కలసి రామ్ చరణ్ చేత పెద్దాయనికి అపాలజి చెప్పేలా ఏర్పాట్లు చేయిస్తున్నారని. అయితే చిరంజీవి దీనికి ఓకే అంటారా..మేస్త్రి మాటలంటేనే మండిపడుతున్న చిరు తన కొడుకు స్పీడుని ఆపుతారా అన్నది ప్రశ్న. కెరిర్ లో స్పీడు ఎలా ఉన్నా దాసరి,రామ్ చరణ్ లు ఇద్దరూ మాటల్లో జోరుగా ఉన్నారు.అంతేగాక దాసరి కి ఇప్పుడు రామ్ చరణ్ కి కౌంటర్ ఇవ్వాలంటే అర్జెంటుగా హిట్ కావాలి. అంటే పెద్ద హీరో కావాలి. హీరోల మీద,అనూష్క లాంటి పరబాషా హీరోయిన్స్ మీద కామెంట్ చేసిన ఆయనకి ఎవరు దొరుకుతారు అనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నే. చూడాలి ఈ కోల్డ్ వార్ ఎక్కడ ఆగుతుందో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+