వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాసరిదే తప్పంటున్నారు

By Srikanya
|
Google Oneindia TeluguNews

Dasari Narayana Rao
ఇన్నాళ్ళూ దాసరి,రామ్ చరణ్ గొడవను ఎంజాయ్ చేసి ఏ కామెంట్ చేయకుండా ఉన్నవాళ్ళు సైతం దాసరినే తిడుతున్నారు.దాసరి నారాయణరావు ఈ మధ్యన కంటిన్యూగా హీరోలను,హీరోయిన్స్ ని కామెంట్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.పరమవీర చక్ర అనంతరం ఏ సినిమా మొదలుపెట్టని ఆయన ఆ మధ్యన అనూష్క మీద బాణం ఎక్కుపెట్టి పంక్షన్స్ కి హీరోయిన్స్ రారని వారని పిలవొద్దని చెప్పారు.ఆ తర్వాత యంగ్ హీరోల మీద ఆయన వాగ్బాణాలు సంధించారు.అయితే వాటిల్లో చాలా బాగం నిజమే ఉండటంతో ఎవరూ ఆయన వెనక కూడా తప్పు పట్టే సాహసం చేయలేదు. అయితే తాజాగా సలోని ఉదంతంతో ఆయన అందరికీ దొరికిపోయారు.

తాజాగా తెలుగు అమ్మాయి ఆడియోకు హాజరై సలోనిని కామెంట్ చేయటం ఆయన తన పెద్దరికాన్ని కావాలని బయిటపెట్టుకోవటానకి చేసిన ప్రయత్నం అంటున్నారు. అదే ఫంక్షన్ కి హాజరైన కోడి రామకృష్ణ మాట్లాడుతూ సలోనిని సౌందర్యని రీప్లేస్ చేయటానకి వచ్చినట్లుందని అన్నారు. అలాగే ఫస్ట్ క్రెడిట్ గోస్ టు సలోని..ఎందుకంటే ఒకప్పుడు సౌందర్య అటు సెంటిమెంట్ అటు యాక్షన్, ఇటు గ్లామర్ అన్నీ పండించేది..మళ్ళీ సౌందర్యని రీప్లేస్ చేయటానకి వచ్చిన అమ్మాయిగా సలోని అనిపించింది అన్నారు.

కోడి రామకృష్ణ తర్వాత అదే పంక్షన్ లో మాట్లాడిన దాసరి, కోడి రామకృష్ణ మాటలను తప్పు పట్టారు. ఆయన మాట్లాడుతూ..ఇందాక మావాడు రామకృష్ణ ..సలోనిని సౌందర్యతో పోల్చాడు. అంతవరకూ వద్దు అప్పుడే. ఎందుకంటే ఇప్పటికే వీళ్ళు మన నెత్తిమీదకు ఎక్కేసారు అని వ్యాఖ్యానించారు. ఆమె మంచి నటి వరకూ ఓకే కానీ సౌందర్య ప్లేస్ భర్తీ చేస్తుందనద్దు అన్నారు.సలోనికి ఇండస్ట్రీలో పెద్దగా ఆపర్స్ లేకపోయినా బుద్ది మంతురాలనే పేరు ఉంది.ఆమెపై రాయి విసరటంతో దాసరి అందరి కామెంట్స్ కు గురి అవుతున్నారు.అంతేగాక దాసరిని ఇక పంక్షన్స్ కి పిలవకుండా ఉంటే బావుండనని అనుకుంటున్నారు.

English summary
Tollywood director Dasari Narayana Rao once again make controversial comments on Telugu heroines in a movie audio launch program and he says Tollywood heroines are more arrogant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X